Begin typing your search above and press return to search.
3078 బ్యాంకు ఖాతాలు.. 150 కార్లు..
By: Tupaki Desk | 15 July 2015 10:22 AM GMT పశ్చిమబెంగాల్ పొంజి స్కీం స్కాంలో నిందితుడు, రోజ్ వ్యాలీ గ్రూప్ సీఎండీ గౌతమ్ కుందు ఆస్తులను ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అటాచ్ చేసింది... అయితే... ఆయన ఆస్తుల లెక్క చూస్తే ఎవరికైనా బుర్ర గిర్రున తిరగడం ఖాయం. 12 రాష్ట్రాల్లో 700 ఎకరాలు ఆయనకు ఉన్నాయి... అంతేకాదు, 150 కార్లూ ఆయన సొంతం. 900 బ్రాంచులున్న ఆ గ్రూప్ నకు ఏకంగా 3078 బ్యాంకు ఖాతాలున్నాయి. పశ్చిమబెంగాల్ లోనే కొన్నాళ్లుగా సంచలనం రేపుతున్న శారద చిట్స్ కుంభకోణం కంటే ఇది చాలా పెద్దది.
అయితే.. ఇవన్నీ దొరికన లెక్కలు మాత్రమేనని ఇంతకు రెట్టింపు ఆస్తులుంటాయని అధికారులు అంటున్నారు. ఆయనకు వెయ్యి ఎకరాల కంటే ఎక్కువే భూములు ఉండొచ్చని అనుమానిస్తున్నారు. విశేషమేంటంటే 12 రాష్ట్రాల్లో తన సామ్రాజ్యాన్ని విస్తరించుకున్న కుందు ఆంధ్రప్రదేశ్ లోనూ అడుగుపెట్టడం విశేషం. ఆయనకు ఆంధ్రప్రదేశ్ తో పాటు సొంతరాష్ట్రం బెంగాల్, ఒడిశా, బిహార్, పంజాబ్, ఢిల్లీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, త్రిపుర, జార్ఖండ్, అస్సాం, గోవాల్లోనూ ఆస్తులున్నాయి.
రోజ్ వ్యాలీ గ్రూప్ గత కొద్ది సంవత్సారల్లోనే ఏకంగా 15400 కోట్లు సేకరించింది. ఇటీవల సంచలనంగా మారిన శారద చిట్స్ కుంభకోణం కంటే ఇది నాలుగు రెట్లు ఎక్కువ మొత్తం. అయితే దాదాపు 16 వేల కోట్లు సేకరించినా ఇన్వెస్టర్లకు మెచ్చూరిటీ తరువాత ఇచ్చింది కేవలం 900 కోట్లు మాత్రమేనని ఈడీ తేల్చింది.
గౌతమ్ కుందు ఆస్తుల వివరాలు వింటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే.
- కుందు చెప్పిన లెక్క ప్రకారం దేశవ్యాప్తంగా 700 ఎకరాల భూములున్నాయి.
- దేశవ్యాప్తంగా 25 లగ్జరీ హోటళ్లున్నాయి.
- పశ్చిమబెంగాల్, ఒడిశా, అస్సాం, బీహార్, పంజాబ్, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్ ల్లో 900 బ్రాంచులున్నాయి. వాటిలో కొన్నిటికి సొంత భవనాలున్నాయి.
- రాంచీ, కోల్ కతా, భువనేశ్వర్, ఢిల్లీలో భారీ భవంతులు, విల్లాలు ఉన్నాయి.
- రాంచీలో అయితే ఏకంగా 6 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో విల్లా ఉంది.
- రాంచీలోనే బంగారం, వజ్రాలు విక్రయించే పెద్ద షాపింగ్ మాల్ ఉంది.
... కాగా మార్చి నెలలోనే కుందును అరెస్టు చేశారు. ఈ స్కాం బయటపడడంతో బెంగాల్ లో మమతా బెనర్జీ ప్రభుత్వం, అస్సాంలోకాంగ్రెస్ ప్రభుత్వం, ఒడిశాలో బీజేడీ ప్రభుత్వాలు ఇరకాటంలో పడ్డాయి. ఆయా ప్రభుత్వాల్లోని మంత్రులు, నేతలతో కుందుకు మంచి సంబంధాలు ఉండడమే దీనికి కారణం. కాగా కుందుకు నేరుగా మమతా బెనర్జీతోనే మంచి సంబంధాలున్నాయి. గతంలో ఆయన మమత వేసిన పెయింటింగులను కొన్నారు. కుందుకు బాలీవుడ్ దిగ్గజాలతోనూ మంచి సంబంధాలున్నాయి.
అయితే.... అస్సాంలో కాంగ్రెస్, బెంగాల్ లో తృణమూల్, ఒడిశాలో బీజేడీ ప్రభుత్వాల్లో ఉన్నవారికి కుందుతో సంబంధాలుండడంతో ఈ కుంభకోణంపై పట్టుబిగించి వారందరినీ ఇరుకునపెట్టాలని బీజేపీ భావిస్తున్నట్లుగా సమాచారం.