Begin typing your search above and press return to search.

ఇప్పుడామె రూ.1.7లక్షల కోట్ల సామ్రాజ్యానికి మహరాణి

By:  Tupaki Desk   |   17 July 2020 12:10 PM GMT
ఇప్పుడామె రూ.1.7లక్షల కోట్ల సామ్రాజ్యానికి మహరాణి
X
కరోనా లాంటి ప్రత్యేక సందర్భంలో యావత్ ప్రపంచం స్తంభించినపోయిన పరిస్థితి. ఎక్కడికక్కడ వ్యాపార కార్యకలాపాలు మొదలు విస్తరణతో సహా అన్ని ఆగిపోయాయి. ఇలాంటివేళ.. భారత దిగ్గజ కంపెనీలు మాత్రం ఊహించని రీతిలో నిర్ణయాలు తీసుకుంటూ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. గడిచిన మూడు నెలల కాలంలో జియో తన వాటాల్ని పెద్ద ఎత్తున అమ్మటమే కాదు.. కంపెనీని రుణరహితంగా మార్చటం తెలిసిందే. తాజాగా ప్రముఖ టెక్ కంపెనీ హెచ్ సీఎల్ వ్యవస్థాపకుడు శివ్ నాడార్ కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు.

అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తూ.. కంపెనీ ఛైర్మన్ బాధ్యతల నుంచి వైదొలిగిన ఆయన.. కంపెనీ పగ్గాల్ని తన కుమార్తెకు అప్పగించి అందరిని విస్మయానికి గురి చేశారు.తాజాగా శివనాడార్ కుమార్తె రోష్ని నాడార్ మల్హోత్రా కంపెనీ బాధ్యతల్ని చేపట్టనున్నారు. దేశంలోనే అత్యంత మహిళా సంపన్నురాలిగా పేరున్న ఆమె ఇకపై హెచ్ సీఎల్ ఎండీగా వ్యవహరించనున్నారు. భారత్ లో ఐటీ ఇండస్ట్రీ ఇంతలా పెరగటానికి కారణమైన ప్రముఖుల్లో శివనాడార్ ఒకరు. తమిళనాడుకు చెందిన ఆయన దేశ స్వాతంత్య్రానికి ముందు జన్మించారు. దేశంలోని టాప్ ఐదు టెక్ కంపెనీల్లో హెచ్ సీఎల్ ఒకటి.

ఫూణేలోని వాల్ చంద్ గ్రూప్ ఆఫ్ ఇంజినీరింగ్ లో కెరీర్ స్టార్ట్ చేసిన ఆయన.. వ్యాపార నిర్వహణలో కాస్త అనుభవం గడించిన తర్వాత బయటకు వచ్చేశారు. సొంతంగా వ్యాపారాన్ని ప్రారంభించారు. స్నేహితులతో కలిసి మైక్రో క్యాంప్ పేరుతో ప్రారంభించిన ఆయన టెలీ డిజిటల్ క్యాలిక్యులేటర్లను అమ్మేవారు. లక్ష్య సాధన కోసం కలల్ని కనండి. లక్ష్యం లేకుంటే విజయాన్ని సాధించలేమనే ఆయన మాటల్ని తరచూ చెబుతుంటారు.
తర్వాతి కాలంలో ఆయన హిందుస్తాన్ కంప్యూటర్స్ లిమిటెడ్ (హెచ్ సీఎల్) కంపెనీని ఏర్పాటు చేశారు. కంప్యూటర్లను తయారు చేయటం ద్వారా పేరొందిన ఆయన ప్రపంచంలోనే గుర్తింపు పొందారు. ప్రస్తుతం హెచ్ సీఎల్ మార్కెట్ క్యాప్ ఏకంగా రూ.1.7లక్షల కోట్లు కావటం గమనార్హం. తాజాగా కంపెనీ పగ్గాల్ని కుమార్తెకు అప్పగించిన ఆయన మరో సంచలనానికి తెర తీశారు.