Begin typing your search above and press return to search.
రౌండప్ చేసిన కార్యకర్తలు.. భయంతో అభ్యర్థి పరుగులు
By: Tupaki Desk | 24 March 2021 5:30 AM GMTఎన్నికలన్నాక పోటీచేసే ప్రతి అభ్యర్థి జనంలోకి వెళ్లాలి. వారితో మమేకం కావాలి.. పశ్చిమ బెంగాల్ ఎన్నికల సందర్భంగా అభ్యర్థులంతా జనంలోకి వెళ్లి మమేకమవుతున్నారు. అయితే అందమైన హీరోయిన్లు పోటీచేసే చోట కాస్త ఇబ్బంది. ఆమె ప్రచారానికి రాగానే కార్యకర్తలు, ప్రజలు మీద పడిపోతారు.. తాజాగా అలానే జరిగింది..
పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అభ్యర్థి , ప్రముఖ నటి అయిన సయోనీ ఘోష్ ప్రచారం సందర్భంగా చేదు అనుభవం ఎదురైంది. సయోనీ ఘోష్ టీఎంసీ పార్టీ తరుఫున దక్షిణ అసాన్సోల్ నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్నారు. నియోజకవర్గంలోని బాన్సూర్ లో ర్యాలీ నిర్వహించగా.. స్థానికులను కలుస్తూ వారితో కరచాలనం చేస్తూ తనకు ఓటేసి గెలిపించాలని అభ్యర్థించారు.
ఈ సందర్భంగా హీరోయిన్ అయిన అభ్యర్తి తమ వద్దకే రావడంతో పార్టీ కార్యకర్తలంతా ఆమెను చూసేందుకు సయోనీపైకి దూసుకొచ్చారు. కాస్త దూరంగా ఉండాలని ఆమె వారించినా వారు వినకుండా ఆమెను తాకేందుకు పోటీపడ్డారు.
దీంతో చేసేందేం లేక సయోనీ ఘోష్ వారి నుంచి తప్పించుకునేందుకు అక్కడి నుంచి పరుగులు తీశారు. ఈఘటనపై నెటిజన్లు కామెంట్స్ చేస్తూ మండిపడుతున్నారు. సొంత పార్టీ మహిళలకు కూడా రక్షణ కల్పించలేని స్తితిలో టీఎంసీ ఉందని మండిపడుతున్నారు. బెంగాల్ రాష్ట్రంలోన మహిళలకు ఎలాంటి రక్షణ కల్పిస్తుందని ప్రశ్నిస్తున్నారు.