Begin typing your search above and press return to search.
క్రికెట్ మ్యాచ్ లో వివాదం.. ఏడుగురు మృతి
By: Tupaki Desk | 24 Nov 2018 11:40 AM GMTపాకిస్తాన్ లో గన్ కల్చర్ కు ప్రతీక ఈ సంఘటన.. చిన్న పిల్లల క్రికెట్ లో మొదలైన గొడవ.. వారి తల్లిదండ్రుల వద్దకు అటు నుంచి కుటుంబాలకు పాకి ఒకరినొకరు కాల్చుకున్న సంఘటన సంచలనంగా మారింది.. ఇదంతా పోలీస్ స్టేషన్ ముందే జరగడం అందరినీ షాక్ కు గురిచేసింది. పోలీసులు మౌన సాక్షిగా చూస్తున్న వేళే ఇరు వర్గాలు కాల్పులకు తెగబడడం గమనార్హం.
పాకిస్తాన్ లోని అబోటాబాద్ జిల్లాలో జరిగిన క్రికెట్ మ్యాచ్ లో వివాదం చిలికి చిలికి గాలివానలా మారింది. క్రికెట్ ఆడుకుంటున్న చిన్నారుల మధ్య స్వల్ప వివాదం పెద్దదైంది. ఘర్షణ పడి తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పరస్పరం అబోటాబాద్ పోలీస్ పోస్టు వద్ద ఫిర్యాదు చేయడానికి వచ్చారు.
ఈ క్రమంలో ఇద్దరూ ఎదురుపడి గొడవ పెట్టుకున్నారు. ఇది తీవ్ర స్థాయికి వెళ్లి ఒక గ్రూపు తమ వద్ద ఉన్న తుపాకులతో కాల్పులు జరిపారు. మరో గ్రూపు వాళ్లు కూడా కాల్పులు జరపడంతో పోలీస్ స్టేషన్ కాల్పులతో దద్దరిల్లింది. ఈ ఘటనలో ఓ గ్రూపులో ముగ్గురు.. మరో గ్రూపులో నలుగురు మృతి చెందారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. చిన్నారుల మధ్య చిన్న క్రికెట్ వివాదం రెండు కుటుంబాలను బలి తీసుకోవడం అందరినీ షాక్ కు గురిచేసింది. బాధ్యులైన వారిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.