Begin typing your search above and press return to search.

హైదరాబాద్ లో ఈ రౌడీల రచ్చేంది కేసీఆర్?

By:  Tupaki Desk   |   29 Sept 2016 12:17 PM IST
హైదరాబాద్ లో ఈ రౌడీల రచ్చేంది కేసీఆర్?
X
ఇటీవల కాలంలో హైదరాబాద్ లో రౌడీలు రచ్చ చేస్తున్నారన్న ఆరోపణలు తీవ్రమవుతున్నాయి. దీనికి తగ్గట్లే పలు ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. సినిమాల్లో చూపించినట్లే నిన్న (బుధవారం) అర్ధ రాత్రి దాటిన తర్వాత జూబ్లీహిల్స్ లోని ఒక పబ్ లో రౌడీలు ఆగమాగం చేశారు. ఈ ఘటన సంచలనం సృష్టించింది. విచక్షణారహితంగా సిబ్బందిపై దాడి చేసిన రౌడీ గ్యాంగ్ అరాచకం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

మల్లేపల్లకి చెందిన జంగ్లీ అనే రౌడీషీటర్ తన ఫ్రెండ్స్ తో కలిసి బుధవారం అర్దరాత్రి దాటిన తర్వాత క్యాపిటల్ పబ్ కు వచ్చాడు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న వారు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. రాత్రి 12 గంటలుదాటిన నేపథ్యంలో పబ్ మూసివేశారు. దీంతో వారిని వెళ్లిపోవాలని చెప్పిన సిబ్బందిపై తీవ్రంగా ప్రవర్తించారు. బౌన్సర్లపై దాడి చేసి వీరంగం సృష్టించారు.

లోపలికెళ్లి పబ్ సిబ్బందిపై దాడి చేస్తూ.. ఫర్నీచర్ ను ధ్వంసం చేశారు. రౌడీ గ్యాంగ్ చేసిన రచ్చ మొత్తం పబ్ లోని సీసీ కెమేరాల్లో రికార్డు అయ్యింది. ప్రస్తుతం మీడియాలోనూ.. సోషల్ మీడియాలోనూ రౌడీల ఆరాచకం ఇప్పుడు వైరల్ అయ్యింది. విశ్వనగరంగా చెబుతున్న హైదరాబాద్ లో రౌడీలు ఇంతలా చెలరేగిపోవటంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక లుక్కు వేస్తే మంచిదన్న మాట వినిపిస్తోంది. ఇలాంటి వార్తలు తరచూ మీడియాలో వస్తే హైదరాబాద్ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.



Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/