Begin typing your search above and press return to search.
సౌదీలో అంతే.. రాజ కుటుంబాల వారిని అలా జైల్లో పడేస్తారంతే
By: Tupaki Desk | 12 Jan 2022 3:38 AM GMTప్రపంచానికి పెద్దన్న అయిన అమెరికా మొదలుకొని.. సంపన్న దేశాలు చాలా వరకు మానవ హక్కుల గురించి మాట్లాడుతుంటారు. అప్పుడప్పుడు పెద్ద ఎత్తున ప్రకటనలు చేస్తుంటారు. అలాంటి వారెంతో మంది అన్ని మూసుకొని ఉండటం సౌదీలో కనిపిస్తుంది. ఈ సంపన్న రాజ్యంలో నేటికీ రాచరికమే అమల్లోకి ఉంది. అధికారంలో కూర్చున్న వారి మాటలే అక్కడ ఫైనల్. మిగిలిన వారికి అసలేం జరుగుతుందన్న విషయాన్నిబయటకు మాట్లాడే ధైర్యం కూడా చేయరు. ఇక.. మానవహక్కులు లాంటి మాటలు అస్సలు వినిపించనే వినిపించవు.
అలాంటి ఆ దేశంలో తాజాగా ఎవరూ ఊహించని పరిణామం చోటు చేసుకుంది. మూడేళ్ల క్రితం అనుమానాస్పదంగా సౌదీ యువరాణిని అరెస్టు చేయటం.. అప్పటినుంచి దాని గురించి.. దానికి సంబంధించిన వివరాలు ఏమీ బయటకు రాలేదు. ఇదిలా ఉంటే.. తాజాగా సౌదీ యువరాణి కమ్ సౌదీ రెండో రాజు కుమార్తె బిస్మా బిన్ సౌద్ ను 2019లో అరెస్టు చేయటం.. ఆ తర్వాత ఎలాంటి నేరారోపణలు బయటకు రాలేదు.
సౌదీ రాజకుటుంబంలో సింహాసనం మీద పట్టు సాధించేందుకు వీలుగా యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ కఠినంగా వ్యవహరించినట్లు చెబుతారు కానీ.. అసలు విషయాన్ని మాత్రం సామాన్యుల వరకు వెళ్లకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకోవటం కనిపిస్తుంది. ఇప్పటివరకు పలువురు రాజ కుటుంబీకుల్ని ఇబ్బందుల పాలు చేయటం తెలిసిందే.
అలాంటి యువరాజు తాజాగా 58 ఏళ్ల యువరాణి బస్మా తో పాటు ఆమె 30 ఏళ్ల కుమార్తె సుహౌద్ అల్ షరీఫ్ ను కూడా నిర్భందంలోకి తీసుకునే ప్రమాదం పొంచి ఉందన్న విషయం తెలిసిందే. ఇంతకూ తాజాగా వారిని ఎందుకు విడుదల చేశారు? లాంటి ప్రశ్నల్ని అడిగే సాహసం చేయకూడదు.
యువరాణి బస్మా ఆస్ట్రియో పోరోసిస్ సహా పలు అనారోగ్యాలతో బాధ పడుతున్నట్లుగా చెబుతున్నారు. తగిన చికిత్సల కోసం ఆమెను అనుమతిస్తారు. ట్రీట్ మెంట్ కోసం స్విట్జర్లాండ్ కు వెళ్లే ప్రయత్నాలు ఉన్న బస్మాను సెక్యూరిటీ ఏజెంట్లు అన్యాయంగా అదుపులోకి తీసుకున్నారు. జైల్లో సుదీర్ఘ కాలం ఉండటం కూడా.. ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింది.
దీంతో ఆమె విడుదల కోసం ఐక్యరాజ్య సమితికి అప్లికేషన్ పెట్టినట్లు కూడా చెబుతారు. ఎట్టకేలకు యువరాణి విడుదల కావటం చాలామంది మానవతావాదులు సంతోషాన్ని వ్యక్తం చేస్తుండటం గమనార్హం.