Begin typing your search above and press return to search.

తెలంగాణ అసెంబ్లీలో RRR ఎఫెక్ట్‌.. బీజేపీ టోట‌ల్ స‌స్పెన్ష‌న్‌!

By:  Tupaki Desk   |   7 March 2022 8:33 AM GMT
తెలంగాణ అసెంబ్లీలో RRR ఎఫెక్ట్‌.. బీజేపీ టోట‌ల్ స‌స్పెన్ష‌న్‌!
X
తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాల తొలిరోజునే అనూహ్య సంఘటన చోటుచేసుకొంది. శాసన సభలో మంత్రి హరీశ్రావు బడ్జెట్ ప్రవేశపెడుతుండగా.. బీజేపీ సభ్యులు రాజేందర్, రఘునందర్రావు, రాజాసిం గ్.. RRR అడ్డుతగులుతున్నారంటూ వారిని సభ నుంచి సస్పెండ్ చేశారు.

ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయా లంటూ.. మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ తీర్మానం ప్రవేశపెట్టగా.. సభ ఆమోదించింది. దీనిపై స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రకటన చేశారు. బ‌డ్జెట్‌ సెషన్ పూర్తయ్యే వరకు బీజేపీ సభ్యులను సస్పెండ్ చేస్తున్నట్లు వెల్లడించారు. సభ నుంచి బయటకు వెళ్లాలని సూచించారు.

ప్రభుత్వ తీరుపై బీజేపీ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో మాట్లాడే హక్కు కూడా లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ.. అసెంబ్లీ ఆవరణలో నిరసనకు దిగారు. వారికి నచ్చజెప్పేందుకు అసెంబ్లీ సిబ్బంది, పోలీసులు యత్నిస్తున్నారు. చివరకు ముందుగా రాజాసింగ్, రఘునందన్ రావును మార్షల్స్ బయటకు తరలించారు. ఆ తరువాత ఈటలను కూడా బయటకు తరలించారు.

గవర్నర్ ప్రసంగం లేదంటూ బీజేపీ ఎమ్మెల్యేలు నిరసనకు దిగారు. దీంతో బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు బీజేపీ సభ్యులు ఈటల రాజేందర్, రాజాసింగ్, రఘునందన్‌ రావును సస్పెండ్ చేయాలంటూ శాసనసభ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ రావు తీర్మానాన్ని ప్రతిపాదించారు. ఇందుకు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆమోదం తెలిపారు. మొత్తం ముగ్గురు బీజేపీ సభ్యులపై సస్పెన్షన్ వేటు పడింది. అనంతరం మంత్రి హరీష్‌ రావు బడ్జెట్ ప్రసంగాన్ని కొనసాగించారు.

ఇదిలావుంటే, తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేప‌థ్యంలో రెండు వేల మంది పోలీస్ సిబ్బందితో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. అసెంబ్లీ పరిసర ప్రాంతాలలో ఆంక్షలు విధించారు. అసెంబ్లీలో మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు.

అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో ర్యాలీలు, నిరసనలు, సమావేశాల ను పోలీసులు నిషేధించారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటామ ని పోలీసులు హెచ్చరించారు.