Begin typing your search above and press return to search.
సీబీఐ డైరెక్టర్‌కు ఆర్ ఆర్ ఆర్ సంచలన లేఖ ఏమన్నారంటే..
By: Tupaki Desk | 30 Oct 2021 3:46 PM GMTఏపీలో పరిణామాలు ఒక్కసారిగా వేడెక్కాయి. మరోసారి రాజకీయ వివాదాలకు కారణంగా మారాయి. ముఖ్యమంత్రి జగన్, ఎంపీ విజయసాయిరెడ్డితోపాటు అనేక మందిపై గతంలో సీబీఐ, ఈడీ కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఇవన్నీ హైదరాబాద్ కోర్టులో విచారణలో ఉన్నాయి. ఈ కేసుల్లో జగన్ తరఫున వాదించే లీగల్ టీమ్‌లో ప్రముఖ లాయర్ పి.సుభాష్ ఒకరు. అంటే... జగన్‌కు ఆయన సొంత లాయరు. ఇదిలావుంటే.. జగన్ సర్కారు వచ్చాక 17 మంది న్యాయవాదులను ప్రభుత్వ ప్లీడర్లుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో సుభాష్ కూడా ఒకరు. అంటే, అప్పటి వరకు జగన్ కేసులను వాదించిన న్యాయవాది, జగన్ సర్కారు రాగానే ప్రభుత్వ ప్లీడర్‌గా నియమితులయ్యారన్నమాట. ఇదే విషయాన్ని ఒక ప్రముఖ పత్రిక వెలుగులోకి తెచ్చింది.
అంతేకాదు.. పి. సుభాష్‌ను సీబీఐ కూడా తన లాయర్‌గా నియమించుకుంది. దీంతో అటు జగన్ ప్రభుత్వానికి, ఇటు సీబీఐకి కూడా ఈయనే వాదనలు వినిపించాలి. అయితే.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా.. ఈయన ఎలాంటి వాదనలూ వినిపించరు కదా! అనేది సదరు పత్రిక వాదన. దీనిపై వెంటనే స్పందించిన వైసీపీ రెబల్ ఎంపీ.. రఘురామరాజు.. సీబీఐ డైరెక్టర్‌కు లేఖరాశారు. జగన్మోహన్‌రెడ్డి తరపు న్యాయవాది పి.సుభాష్‌ను సీబీఐ స్టాండింగ్ కౌన్సిల్ న్యాయవాదిగా నియమించడంపై లేఖ రాశారు. న్యాయవాది పి.సుభాష్... జగన్ అక్రమాస్తుల కేసులను వాదించారని తెలిపారు. వైస్ వివేకానందరెడ్డి హత్య, ప్రముఖ డాక్టర్ సుధాకర్ అనుమానాస్పద మృతి సహా, వైసీపీ నేతలు న్యాయమూర్తులను దూషించడంపై కూడా సీబీఐ విచారణ జరుపుతోందన్నారు.
ఇలాంటి విచారణ నేపథ్యంలో సీబీఐ తరపున పి.సుభాష్‌ను స్టాండింగ్ కౌన్సిల్‌గా నియమించడం సీబీఐపై విశ్వాసాన్ని సన్నగిల్లెలా చేస్తోందన్నారు. న్యాయమూర్తులపై దూషణల కేసును నేరుగా పర్యవేక్షణ చేయమని హైకోర్టు సీబీఐ డైరెక్టర్‌ను ఆదేశించిందని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి తరపున పని చేసిన న్యాయవాదిని సీబీఐ స్టాండింగ్ కౌన్సిల్ నియమించడం అనేక సందేహాలకు, అనుమానాలకు తావిస్తోందని చెప్పారు. నిష్పక్షపాక్షత, పారదర్శకత దర్యాప్తు కోసం సీబీఐ స్టాండింగ్ కౌన్సిల్ న్యాయవాదిగా పి.సుభాష్‌ని తొలగించాలని డిమాండ్ చేస్తూ లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ లేఖపై సీబీఐ డైరెక్టర్ ఎలా రియాక్ట్ అవుతారనేది ఆసక్తిగా మారింది. మరోవైపు.. హైకోర్టు కూడా న్యాయమూర్తులపై దూషణల కేసులో.. సీబీఐ డైరెక్టరే నేరుగా కేసును పరిశీలించాలని.. ఆదేశించనున్నట్టు తెలిపింది. ఈ క్రమంలో ఆర్ ఆర్ ఆర్ లేఖ ప్రాధాన్యం సంతరించుకుంది.