Begin typing your search above and press return to search.

కరోనా లో కక్కుర్తి ... నకిలీ శానిటైజర్ తో రూ.10 కోట్ల వ్యాపారం !

By:  Tupaki Desk   |   25 April 2021 12:30 AM GMT
కరోనా లో కక్కుర్తి ... నకిలీ శానిటైజర్ తో రూ.10 కోట్ల వ్యాపారం  !
X
దేశం మొత్తం కరోనా వైరస్ తో వణికిపోతుంటే .. కొంతమంది మాత్రం ఈ కరోనా సమయంలో కూడా క్యాష్ చేసుకునే పనిలో నిమగ్నమైయ్యారు. ప్రజల అవసరాలను ఆసరాగా తీసుకుని దోచేసుకుంటున్నారు. ప్రధానంగా మాస్క్ లు, శానిటైజర్ విషయాల్లో నకిలీలను సృష్టిస్తూ భారీగా డబ్బులను ఆర్జిస్తున్నారు కొంతమంది వ్యాపారవేత్తలు. ఇలాగే గుజరాత్ రాష్ట్రంలో ఫేక్ హ్యాండ్ శానిటైజర్ ను విక్రయించి, కేవలం పది నెలల్లో రూ. 10 కోట్ల ఉత్పత్తులను విక్రయించాడు. ప్రస్తుతం కరోనా టైం నడుస్తోంది. ప్రతి ఇంట్లో మాస్క్, శానిటైజర్ తప్పనిసరి అయిపోయింది. అత్యంత అవసరమైన వస్తువుల్లో శానిటైజర్ మారిపోయింది.

ఈ కరోనా వైరస్ , సూక్ష్మ క్రిముల నుంచి రక్షిస్తుందని వైద్యులు సూచిస్తున్న సంగతి తెలిసిందే. గుజరాత్ లోని వడోద్రలో నితిన్ కొత్వానీ అనే వ్యక్తి నగరంలో 10 నెలలుగా హ్యాండ్ శానిటైజర్ విభాగాన్ని నడుపుతున్నాడు. అయితే, ప్రమాదకరమైన రసాయనాన్ని ఉపయోగించి శానిటైజర్ తయారు చేస్తున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. కాలుష్య నియంత్రణ మండలి అధికారులు శానిటైజర్ విభాగంపై దాడి చేశారు. పెద్ద మొత్తంలో మిథనాల్ వాడుతున్నట్లు గుర్తించారు. అనంతరం మంగళవారం అతడిని కొత్వానీని అరెస్టు చేశారు. 14 వేల 741 కంటెనర్లలో ఉన్న 8 వేల 025 లీటర్ల కల్తీ శానిటైజర్ ను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 5 లీటర్లు, 500 ఎంఎల్, 200 ఎంఎల్, 100 ఎంఎల్, 50 ఎంఎల్ ప్యాకేజీలున్నాయి. స్వాధీనం చేసుకున్న వస్తువుల విలువ రూ. 45.47 లక్షలుగా ఉంటుందని అంచనా వేశారు. మొత్తంగా కొత్వానీ రూ. 10 కోట్ల విలువైన ఉత్పత్తులను విక్రయించాడని అధికారులు వెల్లడించారు.