Begin typing your search above and press return to search.

అనాథ పిల్లలకు బీమా ఉన్నా రూ.10లక్షల పరిహారం : ఏపీ సర్కార్ !

By:  Tupaki Desk   |   2 Jun 2021 11:45 AM IST
అనాథ పిల్లలకు బీమా ఉన్నా రూ.10లక్షల పరిహారం : ఏపీ సర్కార్ !
X
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని , దేశాన్ని ఏ విదంగా నాశనం చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కరోనా మహమ్మారి కారణం ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. ఎన్నో కుటుంబాలు రోడ్డున ప‌డ్డాయి. ఎంతోమంది చిన్న పిల్ల‌లు త‌ల్లిదండ్రుల‌ను కోల్పోయారు. ఈ క్ర‌మంలో అనాథలైన పిల్ల‌ల‌కు రూ. 10 ల‌క్ష‌ల బీమా చేసేందుకు ఏపీలోని జ‌గ‌న్ స‌ర్కార్ నిర్ణ‌యించింది. అయితే , తాజాగా ఈ భీమా ఇచ్చే నియమాలలో ఏపీ ప్రభుత్వం కీలక సవరణలు చేసింది. తల్లిదండ్రులు చనిపోయిన పిల్లలకు రూ.10 లక్షల పరిహారం ఇచ్చే నిబంధనల్లో మార్పు చేస్తూ స‌ర్కార్ ఆదేశాలు జారీ చేసింది.

ఏదేని ప్రభుత్వ బీమా లేని వారికి మాత్రమే రూ.10లక్షల పరిహారం ఇవ్వాలి అనే నిబంధనను తొలగించారు. బీమా ఉన్నా రూ.10లక్షలు పరిహారం ఇవ్వాలని నిర్ణయించింది. దీనితో మరికొంతమంది పిల్లలకు లబ్ధి చేకూరనుంది. ఈ మేరకు ఉత్తర్వులు అమలు చేయాలని ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌ కలెక్టర్లను ఆదేశించారు. దేశాన్ని కరోనా వైరస్ మహమ్మరి గడగడలాడిస్తోంది. రాష్ట్రాన్ని సైతం వణికిస్తోంది. కరోనా బారిన పడి ఆస్పత్రల్లో చేరే పేద, మధ్య తరగతి కుటుంబాలు చితికిపోతున్నాయి. ఈ మహమ్మారి కాటుకు అనేకమంది మృత్యువాత పడుతున్నారు. కరోనా కారణంగా అనేకమంది పిల్లలు తమ తల్లిదండ్రులను కోల్పోయారు. తల్లిదండ్రులను కోల్పోయి చిన్న వయసులోనే పిల్లలు అనాథలుగా మారాల్సిన దుస్థితి నెలకొంది. అలాంటి వారికి సీఎం జగన్ అండగా నిలిచారు. ఆ పిల్లలకు రూ.10 లక్షలు సాయం చేయాలని నిర్ణయిచారు. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా 18 ఏళ్లు దిగువ‌న ఉండి.. క‌రోనా కార‌ణంగా పేరెంట్స్‌ను కోల్పోయిన పిల్ల‌ల‌కు ఈ బీమా వ‌ర్తిస్తుంది. వారికి 25ఏళ్లు వచ్చే వరకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్ చేస్తారు. పిల్లలకు 25ఏళ్లు వచ్చిన తర్వాత ఈ డబ్బు విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉంది.