Begin typing your search above and press return to search.
పెళ్లి పేరుతో డ్యాన్సర్ వద్ద రూ.11.75 లక్షలు స్వాహా !
By: Tupaki Desk | 5 March 2021 11:30 AM GMTసైబర్ క్రైమ్స్ .. ఈ మధ్య కాలంలో బాగా పెరిగిపోతున్నాయి. పోలీసులు ఎంతగా ప్రజలని అప్రమత్తం చేస్తున్నా కూడా సైబర్ మాయగాళ్లు ఎలాగోలా వారిని బురిడీ కొట్టిస్తేస్తున్నారు. డేటింగ్ వెబ్ సైట్స్, డేటింగ్ యాప్స్, వాయిస్ చేజింగ్, టెలీఫోన్ కాల్స్, సోషల్ మీడియా వేదికగా ఈ తరహా మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. తాజాగా హైదరాబాద్ కి చెందిన మహిళా డ్యాన్సర్ కు మాట్రిమోనియల్ సైట్ ద్వారా పరిచమైన సైబర్ నేరగాడు పెళ్లి పేరుతో ఏకంగా రూ.11.75 లక్షలు ఊడ్చేశాడు.
ఆ డ్యాన్సర్ ఫిర్యాదు తో గురువారం కేసు నమోదు చేసుకున్న సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేపట్టా రు. బంజారాహిల్స్ కు చెందిన సదరు డ్యాన్సర్ షాదీ.కామ్ లో తన ప్రొఫైల్ ను అప్ లోడ్ చేశారు. దీన్ని చూసి ఆకర్షితుడయ్యానంటూ సైబర్ నేరగా డు ఎన్ ఆర్ ఐ గా పరిచయం చేసుకున్నాడు. తాను ప్రస్తుతం లండన్ లో ఉంటున్నానని , ఇక్కడ బీఎండబ్ల్యూ కార్ల కంపెనీలో సూపర్ వైజర్ గా పని చేస్తున్నానంటూ తన మాటలతో బాగా నమ్మించాడు. ఇలా వ్యక్తగత విషయాలు చర్చించుకున్న ఇద్దరూ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఓ రోజు హఠాత్తుగా ఆమెతో మన ప్రేమకు గుర్తుగా, నిన్ను ఆశ్చర్యపరిచేందుకు ఓ అద్భుతమైన బహుమతి పంపుతున్నానంటూ చెప్పాడు. బంగారు ఆభరణాలు, కొన్ని డాలర్లు, ల్యాప్ టాప్ పార్శిల్ చేస్తున్నానని చెప్పిన అతగాడు వాటి ఫొటోలనూ వాట్సాప్‌లో షేర్ చేశాడు. ఇది జరిగిన రెండో రోజు ఢిల్లీ విమానాశ్రయం కస్టమ్స్ అధికారులుగా కొందరు డ్యాన్సర్ కు ఫోన్ చేశారు.
మీ పేరుతో పార్శీల్ వచ్చిందని చెప్పి క్లియర్ చేసేందుకు కొన్ని పన్నులు కట్టాలన్నారు. ఇలా వివిధ క్లియరెన్స్ ల పేరుతో పలుదఫాలుగా రూ.11.75 లక్షలు వివిధ బ్యాంకు ఖాతాల్లో జమ చేయించుకున్నారు. ఆ తర్వాత జరిగిన మోసమని గుర్తించి బాధితురాలు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.