Begin typing your search above and press return to search.

బాసూ...కొత్త 200 నోట్లు ఏటీఎంల‌లో లేవు

By:  Tupaki Desk   |   25 Aug 2017 12:00 PM GMT
బాసూ...కొత్త 200 నోట్లు ఏటీఎంల‌లో లేవు
X
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) రూ. 200 కొత్త నోటును ఇవాళ చ‌లామ‌ణిలోకి తీసుకొచ్చిన విష‌యం తెలిసిందే. ఆర్బీఐ ఈ నోటును చ‌లామ‌ణిలోకి తీసుకొచ్చింది క‌దా అని.. వెంట‌నే ఏటీఎంల‌కు ప‌రిగెత్త‌కండి. ఎందుకంటే...ఏటీఎంల‌లో మీకు రూ. 200 నోటు రాదు. ఎందుకంటే... ఆ నోటును స్కాన్ చేసే సాఫ్ట్ వేర్ ఏటీఎంల‌లో లేక‌పోవ‌డ‌మే! గ‌త సంవ‌త్స‌రం న‌వంబ‌ర్ 8 న దేశ ప్ర‌ధాని పెద్ద నోట్లు రూ. 500 - రూ. 1000 నోట్ల‌ను ర‌ద్దు చేసిన త‌ర్వాత కొత్త‌గా రూ. 500 - రూ. 2000 నోట్ల‌ను తీసుకొచ్చిన సంగ‌తి తెలిసిందే. అయితే.. కొత్త నోట్లు వ‌చ్చినా.. వాటిని గుర్తించే సాఫ్ట్ వేర్ ఏటీఎంల‌లో లేక‌పోవ‌డంతో ప్ర‌జ‌లు డ‌బ్బుల కోసం అల్లాడిన సంగ‌తి గుర్తుండే ఉంటుంది. ఇక‌.. ఇప్పుడు కూడా సేమ్ సీన్‌ రిపీట్ అవుతోంది.

రూ. 200 చ‌లామ‌ణిలోకి వ‌చ్చినా.. బ్యాంకులకు వెళ్లి తీసుకోవాల్సిందే త‌ప్ప‌... ఇప్ప‌టికిప్పుడు ఏటీఎంల‌లో మాత్రం క‌నిపించ‌వు. ఇంత‌కీ సాఫ్ట్‌ వేర్ క‌ష్టాలు ఎప్పుడు తీరుతాయో అనే దానిక స‌మాధానం...క‌నీసం ఓ నెల‌. అంటే...కొత్త రూ. 200 నోటును ఏటీఎం లో చూడాలంటే నెల ఎదురు చూడాలి. లేదంటే బ్యాంకుల‌కెళ్లి తెచ్చుకోవ‌డ‌మే! మ‌రోవైపు ఆర్బీఐ కొత్త రూ. 200, రూ. 50 నోట్లను విడుదల చేయ‌డంతో ఢిల్లీలోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వేదికగా కొత్త నోట్లు అందుబాటులోకి వచ్చాయి. పలువురు ఖాతాదారులు కొత్త నోట్లను విత్‌ డ్రా చేసుకునేందుకు ఆర్బీఐ వద్ద బారులు తీరారు. కొత్త నోట్లతో ఫోటోలకు ఫోజులిస్తున్నారు ఖాతాదారులు.

దృష్టిలోపం ఉన్న వారు కూడా గుర్తు పట్టేలా రూ. 200 - రూ. 50 కొత్త నోట్లను రూపకల్పన చేశారు. భారతదేశ వారసత్వ - సాంస్కృతిక సంపద ఉట్టిపడేలా కొత్త 200 నోటు వెనుకభాగంలో సాంచీ స్థూపాన్ని ముద్రించారు. నోటు ముందు భాగం కుడివైపు చివరన అశోక స్థూపాన్ని ముద్రించారు. మహత్మా గాంధీ కొత్త సిరీస్ తో ఈ నోటు రానుంది. దేవనాగరి లిపిలో 200 అంకెను నోటు ముందు, వెనుక భాగంలో ముద్రించారు. కొత్త 200 నోటు పసుపు కలర్ లో ఉంది. ఈ నోటుపై ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ సంతకం ఉంది. మైసూర్ గవర్నమెంట్ ప్రెస్ లో కొత్త 200 నోట్లను ముద్రించారు. కొత్త 50 నోటు వెన‌క భాగంలో హంపి రథం బొమ్మ ఉంటుంది. సాంస్కృతి వార‌సత్వానికి నిద‌ర్శ‌నంగా హంపి బొమ్మ‌ను ముద్రించారు. ఫ్లోరోసెంట్ నీలి రంగులో నోటు ఉంటుంది. క‌ల‌ర్ స్కీమ్‌తో పాటు ఇత‌ర డిజైన్‌, జియోమెట్రిక్ ప్యాట‌ర్స్న్ ఉంటాయ‌ని ఆర్బీఐ వెల్ల‌డించింది. ప్ర‌స్తుతం ఉన్న పాత రూ.50 నోటు కూడా చెలామ‌ణిలో ఉంటుంద‌ని ఆర్బీఐ తెలిపింది