Begin typing your search above and press return to search.
ఏటీఎంలలో ఆ నోటు దొరకదట...ఆర్బీఐ షాక్!
By: Tupaki Desk | 5 July 2017 4:49 PM GMT2017 ఏడాదికి ముందే మార్కెట్లోకి కొత్త రూ.200 నోట్లు రాబోతున్నాయని జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆ నోట్ల రాకతో చిల్లర కష్టాలు తీరినట్లేనని అందరూ భావించారు. అయితే, త్వరలో మార్కెట్లోకి రానున్న రూ.200 నోట్లకు సంబంధించి రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా షాకింగ్ న్యూస్ తెలిపింది. మిగతా నోట్లలాగా రూ.200 నోట్లను ఆర్బీఐ అన్ని చోట్లా అందుబాటులో ఉంచకూడదని భావిస్తున్నట్లు సమాచారం.
రూ.1000, రూ.500 నోట్ల రద్దు తర్వాత ప్రజలు చిల్లర కోసం అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చిల్లర కష్టాల నుంచి ప్రజలకు విముక్తి కలిగించేందుకు త్వరలోనే రూ.200 కరెన్సీ నోట్లను ప్రవేశపెట్టబోతోంది. ఇప్పటికే వీటి ప్రింటింగ్ ఆర్డర్ కూడా షురూ అయింది. కొత్త రూ.200 నోట్ల వల్ల లోయర్-డినామినేషన్ కరెన్సీకి సంబంధించిన డిమాండ్, సప్లై మధ్య ఉన్న అంతరం తగ్గుతుందని బ్యాంకింగ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే, అందరూ అనుకునేట్లు ఈ నోట్లను ఏటీఎంలలో అందుబాటులో ఉండకపోవచ్చట. వాటిని కేవలం బ్యాంకు బ్రాంచుల వద్దనే సర్క్యులేట్ చేయాలని ఆర్బీఐ భావిస్తోందని సమాచారం.
రూ.10, రూ.20, రూ.50 కరెన్సీ నోట్ల మాదిరిగా ఈ కొత్త రూ.200 నోట్లు కూడా కేవలం బ్యాంకు బ్రాంచులోనే లభ్యం కానున్నాయని రిపోర్టులు పేర్కొంటున్నాయి.గత ఏడాది నవంబర్ లో పాత రూ.500, రూ.1000 నోట్లను కేంద్రప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ రద్దుతో మార్కెట్లోకి ఎక్కువగా కొత్త రూ.2000, రూ.500 సప్లయ్ చేయడంతో చిన్న నోట్ల కొరత ఏర్పడింది. పెద్ద నోట్లు ఉన్నా వాటిని ఖర్చు చేయలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో రూ.200 నోట్లను కొత్తగా తీసుకురావాలని ఆర్బీఐ నిర్ణయించింది. రద్దుచేసిన రూ.1000 నోటును ఇప్పట్లో తీసుకొచ్చే ఉద్దేశ్యాలు లేనట్టు ఆర్బీఐ వర్గాలు చెప్పాయి.