Begin typing your search above and press return to search.
కారు కడిగారో... 2 వేలు ఫైన్
By: Tupaki Desk | 13 April 2016 5:07 AM GMTచండీగఢ్ మునిసిపల్ అధికారులు నీటి దుర్వినియోగానికి అడ్డుకట్ట వేయడానికి కొత్త పద్ధతులను ఎంచుకున్నారు. ఉదయం వేళల్లో నీటితో కార్లు కడిగినా, మొక్కలకు నీళ్లు పోసినా 2 వేల రూపాయిల జరిమానా విధించాలని నిర్ణయం తీసుకున్నారు. ఉదయం ఐదున్నర గంటలనుంచి ఎనిమిదిన్నర గంటల మధ్య కార్లు కడగాన్ని, మొక్కలకు నీళ్లు పోయడాన్ని అనుమతించబోమని చండిగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బి.కె. ధావన్ చెప్పారు. ఈ నెల 15నుంచి జూన్ 30వ తేదీ వరకూ ఈ విధానం అమల్లో ఉంటుందట. జరిమానాలు విధించడం కోసం మొత్తం 18 బృందాలను ఏర్పాటు చేశారు.
అంతేకాదు... నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటారట. జరిమానా విధించినప్పటికీ మళ్లీ ఆ పని చేస్తే వారికి నీటి సరఫరా కూడా నిలిపివేస్తారు.
చండీగఢ్ లో తీసుకున్న ఈ నిర్ణయం దేశంలో నీటి కొరతకు నిదర్శనంగా నిలుస్తోంది. అయితే... మొక్కలకు కూడా నీరు పోయరాదనడంపై విమర్శలు వస్తున్నాయి. నీటి వృథాను అరికట్టడం మంచిదే అయినా... అందులోనూ ప్రజలకు, పర్యావరణానికి ఇబ్బందిలేని విధానాలు అనుసరిస్తే మంచిదని సూచిస్తున్నారు.