Begin typing your search above and press return to search.
కొత్త మలుపు: ఆర్యన్ బెయిల్ కు రూ.25 కోట్లు డిమాండ్
By: Tupaki Desk | 25 Oct 2021 4:21 AM GMTబాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో అరెస్టు కావటం తెలిసిందే. దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన ఈ ఉదంతానికి సంబంధించి ఇప్పుడు ఊహించని మలుపు చోటు చేసుకుంది. క్రూయిజ్ లో జరిగిన పార్టీలో నిషేధిక మాదక ద్రవ్యాలు ఉన్నాయంటూ ఆర్యన్ ను ఎన్ సీబీ (మాదకద్రవ్యాల నియంత్రణ సంస్థ) అదుపులోకి తీసుకోవటం తెలిసిందే. ఇదే సమయంలోఅక్కడ ఉన్నట్లుగా ప్రత్యక్ష సాక్ష్యుల లిస్టులో ఉన్న వ్యక్తి ఒకరు ఎన్ సీబీ అధికారులు ఆర్యన్ విడుదల కోసం రూ.25 కోట్లు డిమాండ్ చేసినట్లుగా వెల్లడించిన వైనం ఇప్పుడు పెను సంచలనంగా మారింది. దీనికి సంబంధించిన వివరాల్ని సోషల్ మీడియాలో వెల్లడించటంతో దర్యాప్తు అధికారి ఇప్పుడు వివరణ ఇవ్వటంతో పాటు.. తనను ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారంటూ వివరణలు ఇస్తున్నారు. ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటీషన్ మరోసారి న్యాయస్థానానికి వస్తున్న వేళ.. ఈ తరహా ఆరోపణలు చోటు చేసుకోవటం గమనార్హం.
ఆర్యన్ కేసుకు సంబంధించి ప్రత్యక్ష సాక్షిగా ఉన్న ప్రభాకర్ సాయిల్ అనే వ్యక్తి సంచలన ఆరోపణలు చేశారు. ఇంతకీ ఇతను ఎవరంటే.. కేపీ గోసావికి అంగరక్షకుడిగా చెబుతున్నారు. మరి.. ఈ కేవీ గోసావి ఎవరన్న ప్రశ్నకు సమాధానం.. అతనో ప్రైవేటు డిటెక్టివ్. పార్టీ జరిగిన క్రూయిజ్ లో అతను ఉన్నాడు. దీంతో వారిద్దరిని ప్రత్యక్ష సాక్ష్యలు జాబితాలో అధికారులు ఉంచారు. తాజాగా ఎన్ సీబీ విచారణకు హాజరైన ప్రభాకర్ సాయిల్ అధికారులకు షాకింగ్ అంశాల్ని తాను వెల్లడించినట్లుగా పేర్కొనటంతో ఇప్పుడు వ్యవహారం పెను సంచలనంగా మారింది.
ఆర్యన్ ను ఎన్ సీబీ కార్యాలయానికి తీసుకొచ్చిన తర్వాత శామ్ డిసౌజా అనే వ్యక్తితో గోసావి ఫోన్ లో మాట్లాడాడని.. షారుక్ కుమారుడి విడుదల కోసం రూ.25 కోట్లు డిమాండ్ చేయాలని చెబుతుంటే తాను విన్నట్లు పేర్కొన్నారు. చివరకు డీల్ ను రూ.18 కోట్లకు క్లోజ్ చేయాలని చెప్పటం.. అందులో రూ.8 కోట్లు వాంఖడేకు ఇవ్వాల్సి ఉంటుందని కూడా డిసౌజా ఫోన్లో చెబుతున్న విషయాన్ని తాను విన్నట్లు పేర్కొన్నారు.
అంతేకాదు.. గోసావి.. డిసౌజాలను షారుక్ మేనేజర్ పూజా దద్లానీ కలిసినట్లుగా పేర్కొన్నారు. గోసావికి ఇద్దరు వ్యక్తులు రూ.50 లక్షలు ఇచ్చారని.. అందులో రూ.38 లక్షలు తిరిగి ఇచ్చేసినట్లుగా పేర్కొన్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. వాంఖడే (ఆర్యన్ ను అదుపులోకి తీసుకున్న అధికారి).. గోసావి (ప్రైవేటు డిటెక్టివ్) ఇద్దరూ కలిసి తనతో 10ఖాళీ పేపర్ల మీద సంతకాలు తీసుకున్నట్లు చెప్పాడు. ప్రస్తుతం గోసావి కనిపించటం లేదని.. తాను ప్రాణభయాన్ని ఎదుర్కొంటున్నట్లుగా చెప్పాడు.
ప్రభాకర్ చేసిన ఆరోపణలతో ఎన్ సీబీ అధికారులు ఒక్కసారిగా ఆత్మరక్షణలో పడినట్లైంది. దీంతో.. వారు వివరణ ఇవ్వక తప్పలేదు. ఎన్ సీబీ ప్రతిష్ఠను దెబ్బ తీయటానికే ప్రభాకర్ ఈ ఆరోపణలు చేశారని.. కేసు కోర్టు పరిధిలో ఉన్న వేళలో.. ప్రభాకర్ తన వాంగ్మూలాన్ని న్యాయస్థానానికి చెప్పాలే కానీ.. ఇలా సోషల్ మీడియాకు చెప్పటమేమిటి? అని ప్రశ్నిస్తున్నారు. తాజాగా చోటు చేసుకున్న పరిణామాలతో ఎన్ సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే (ఆర్యన్ ను అరెస్టు చేసిన అధికారి) ఆత్మరక్షణలో పడటమే కాదు.. ముంబయి పోలీసు కమిషన్ కు ఒక లేఖ రాశారు. తనను అక్రమ కేసుల్లో ఇరికించేందుకు కుట్ర పన్నుతున్నట్లుగా పేర్కొన్నారు.
తనకు రక్షణ కల్పించాలని కోరారు. తనను జైలుకు పంపుతామని.. ఉద్యోగం నుంచి తొలగించేలా చేస్తామని కొందరు బడా వ్యక్తులు మీడియాలో హెచ్చరించిన వైనాన్ని గుర్తు చేశారు. డ్రగ్స్ కేసు విచారణలో కీలకంగా వ్యవహరిస్తున్న వాంఖడేపై మహారాష్ట్ర ప్రభుత్వ ప్రముఖులు తీవ్ర ఆరోపణలు చేస్తున్న వేళలో.. ఆయనీ లేఖ రాయటం గమనార్హం. ఈ మొత్తం వ్యవహారంపై మహారాష్ట్ర అధికారపక్షం స్పందించింది. ఆ పార్టీ సీనియర్ నేత సంజయ్ రౌత్ రియాక్టు అవుతూ.. ఆర్యన్ ఖాన్ విడుదలకు ఎన్ సీబీ ముడుపులు డిమాండ్ చేసిందన్న ఆరోపణలు షాకింగ్ గా ఉన్నట్లు పేర్కొన్నారు. మహారాష్ట్ర పరువు తీయటానికే ఈ కేసులు పెట్టారని సీఎం ఉద్దవ్ ఠాక్రే భావిస్తున్నట్లుగా తాజా ట్వీట్ చేశారు.
ఈ ట్వీట్ తో పాటు ఆయన ఒక వీడియో క్లిప్పింగ్ ను షేర్ చేశారు. అందులో ఎన్ సీబీ ఆఫీసులో గోసవి (ప్రైవేటు డిటెక్టివ్) ఫోన్ చేతిలో పట్టుకొని (అప్పటికి ఫోన్ స్పీకర్ లో పెట్టి ఉంది) ఆర్యన్ ఖాన్ ఎవరితోనో మాట్లాడుతున్నట్లుగా అందులో ఉంది. ఈ నేపథ్యంలో ఈ ముడుపుల వ్యవహారంపై మహారాష్ట్ర పోలీసులు విచారణ చేపట్టాలంటూ రౌత్ డిమాండ్ చేయటం.. అదే సమయంలో ఎన్ సీబీ అధికారి సమీర్ వాంఖడే ముంబయి పోలీసు కమిషనర్ కు లేఖ రాసిన వైనం చూస్తుంటే.. ఆర్యన్ కేసు కచ్ఛితంగా మరో మలుపు తిరగటం ఖాయమంటున్నారు.