Begin typing your search above and press return to search.
కేంద్రం క్షమాపణ చెప్తే సరిపోదు: కేసీఆర్
By: Tupaki Desk | 21 Nov 2021 3:59 AM GMTవరి ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం సరైన స్పష్టత ఇవ్వడం లేదని సీఎం కేసీఆర్ తెలిపారు. ఎన్నిసార్లు డిమాండ్ చేసినా కేంద్రం స్పందించడం లేదని తప్పుబట్టారు. ఈ నేపథ్యంలోనే ధాన్యం కొనుగోలు చేసేందుకు ఆదివారం ఢిల్లీ వెళ్తున్నామని ప్రకటించారు. ఢిల్లీలో ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలతో ఢిల్లీ వెళ్లనున్నట్లు చెప్పారు. అవకాశం ఉంటే ప్రధాని మోదీని కూడా కలుస్తామని ప్రకటించారు.
రైతుల పోరాటంతోనే కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలు రద్దయ్యాయని కేసీఆర్ గుర్తుచేశారు. దేశవ్యాప్తంగా రైతులపై నమోదైన కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. రైతు ఉద్యమంలో మరణించినవారి కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. ఉద్యమంలో మరణించిన రైతు కుటుంబాలకు తెలంగాణ నుంచి రూ.3 లక్షల ఆర్థిక సాయం అందించనున్నట్లు కేసీఆర్ ప్రకటించారు.
రైతు పోరాటంలో మరణించిన 750 రైతుల కుటుంబాలకు సాయం అందించనున్నట్లు కేసీఆర్ తెలిపారు. సాగు చట్టాలపై కేంద్రం క్షమాపణ చెప్తే సరిపోదని, ప్రతి కుటుంబానికి కేంద్రం రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలని మోదీని కోరారు. విద్యత్ చట్టాన్ని రద్దు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. కృష్ణా, గోదావరిలో నీటి వాటాలు తేల్చాలన్నారు. నీటి వాటాలు తేల్చకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ప్రకటించారు.
సెక్షన్ 3 కింద గోదావరి, కృష్ణా నది నీటి పంపకాలపై ట్రిబ్యూనల్ ను ఏర్పాటు చేయాలని, సకాలంలో నీటి పంపకాలను తేల్చాలని కోరారు. ఎస్టీ రిజర్వేషన్ల పెంపు, ఎస్సీ వర్గీకరణపై కేంద్రం తేల్చాలని, జన గణనలో బీసీ కుల గణన చేపట్టాలని కేంద్రాన్ని కోరుతున్నామని కేసీఆర్ పేర్కొన్నారు.
జన గణనలో బీసీ కుల గణన చేపట్టాలని కేంద్రాన్ని కోరుతున్నామని కేసీఆర్ ప్రకటించారు. అనురాధకార్తె వచ్చిన నేపథ్యంలో ధాన్యం కొనుగోళ్లపై స్పష్టమైన వైఖరి వెల్లడించాలని డిమాండ్ చేశారు. వాస్తవాలను ప్రజలకు వివరించాలని కోరారు. ఢిల్లీ పర్యటనలో ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం స్పష్టమైన వైఖరి తేల్చుకొని వస్తామని చెప్పారు. యాసంగిలో ఏయే పంటలు పండించాలనేది ఢిల్లీ పర్యటన అనంతరం వెల్లడిస్తామని కేసీఆర్ ప్రకటించారు.