Begin typing your search above and press return to search.
లక్షకు నెలకు రూ.30వేలు వడ్డీ .. 300 కోట్లు స్వాహా, అసలు ట్విస్ట్ ఇదే !
By: Tupaki Desk | 15 April 2021 10:36 AM GMTఅనంతపురం జిల్లాలో మరో కొత్త రకం మోసం వెలుగులోకి వచ్చింది. రూ.లక్ష పెట్టుబడి పెడితే నెలకు రూ.30 వేలు వడ్డీ చెల్లిస్తామని ఆశపెట్టి అమాయకుల్ని నిండా ముంచారు. ఈబీఐడీడీ ఫైనాన్స్ సర్వీసు పేరుతో ఓ కంపెనీ ఉన్నట్లు చెప్పారు. ఈ సంస్థ మేనేజర్ గా కడియాల సునీల్ వ్యవహరించారు. ఆయన సహాయకులుగా మహేంద్రచౌదరి, సుధాకర్, మాధవి ఉన్నారు. అందరూ కలిసి నెలకు రూ.లక్ష కడితే రూ.30వేలు వడ్డీ ఇస్తామన్నారు. కొందరికి మాత్రం అలా వడ్డీ చెల్లించారు. చెల్లించిన సొమ్ముకు కొందరికే రశీదులు ఇచ్చారు. ఎక్కువ వడ్డీ వస్తుందని భావించి మరికొందరు అత్యాశకు పోయి రూ.లక్షలు, కోట్లలో సమర్పించుకున్నారు.
ఇక్కడ విచిత్రమేమి అంటే ఆశకి పోయి కొంతమంది అప్పుచేసి మరీ పెట్టుబడి పెట్టారు. అలా అనంతపురం జిల్లాలో దాదాపు రూ.300 కోట్లకు పైగా డిపాజిట్లు సేకరించారు. తర్వాత వారి అసలు స్వరూపం బయటపెట్టారు. మోసపోయామని ఆలస్యంగా తెలుసుకున్న బాధితులు.. 100 మందికి పైగా ధర్మవరం డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. వీరి కింద 100 మంది ఏజెంట్లు పని చేస్తున్నట్లు బాధితులు చెబుతున్నారు. పెద్ద మొత్తాలు చెల్లించిన తర్వాత ఏజెంట్ల మొబైల్ పని చేయలేదు. రెండు, మూడు నెలలుగా వడ్డీలు చెల్లించలేదు. అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. వసంతపురానికి చెందిన బాబుల్‌రెడ్డి ఫిర్యాదు మేరకు ధర్మవరం గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేశారు. 50 మంది బాధితులతో ఎస్పీ సత్యఏసుబాబును కలిశారు. ఓ కానిస్టేబుల్, జిల్లాలో పనిచేస్తున్న ఓ ఎస్సై కూడా ఏజెంటు తరహాలో డబ్బు కట్టించినట్లు తెలుస్తోంది. ఈ ఫైనాన్స్ కంపెనీ పేరు ఈబీఐడీడీ. ఈ సంస్థ మేనేజర్ సునీల్ కడియాల. మహేంద్ర చౌదరి, సుధాకర్, మాధవి ఇతర పొజిషన్లలో ఉన్నారు. ప్రస్తుతం వీళ్లంతా పరారీలో ఉన్నారు.