Begin typing your search above and press return to search.
ఇండియన్ కు పరిహారం ఇవ్వాలని దుబాయ్ ఆసుపత్రికి ఆదేశం
By: Tupaki Desk | 7 Sep 2019 5:42 AM GMTవైద్యం చేయటంలో ప్రదర్శించిన నిర్లక్ష్యం ఒక భారతీయ కుటుంబానికి తీవ్ర వేదనను మిగిల్చింది. దుబాయ్ ఆసుపత్రి దుర్మార్గాన్ని షార్జా కోర్టు నిర్దారిస్తూ పరిహారాన్ని చెల్లించాలన్న ఆదేశంతో పాటు.. అందుకు కారణమైన వైద్యుడిపై చర్యలకు ఆదేశించిన వైనం తాజాగా చోటు చేసుకుంది. కేరళకు చెందిన బ్లెస్సీ టామ్ అనే మహిళ దుబాయ్ కు చెందిన షార్జా వర్సిటీ ఆసుపత్రిలో నర్సుగా సేవలు అందించేవారు. కొల్లంకు చెందిన ఆమెకు ఛాతీ ఇన్ఫెక్షన్ సమస్య ఎదురుకావటంతో వైద్యం కోసం 2015 నవంబరులో సన్నీ మెడికల్ సెంటర్ లో చేరారు
అయితే.. ఆమె సమస్యకు తగినట్లుగా వైద్యం చేయని వైద్యులు.. యాంటీ బయాటిక్స్ ఇవ్వటంతో కొన్ని గంటల వ్యవధిలోనే మరణించింది. ఈ ఉదంతంలో తాము చేసిన తప్పునకు పరిహారం చెల్లించాల్సి వస్తుందన్న సందేహంతో.. ఆమె మరణాన్ని తప్పుగా కోట్ చేస్తూ.. గుండెపోటుతో మరణించినట్లుగా మరణ ధ్రువీకరణ పత్రంలో పేర్కొన్నారు.
తన భార్య మరణానికి కారణం వైద్యుల నిర్లక్ష్యం తప్పించి.. మరింకేమీ కాదంటూ ఆమె భర్త షార్జా కోర్టులో న్యాయపోరాటానికి దిగారు. విచారణ అనంతరం సదరు ఆసుపత్రి చేసింది తప్పన్న విషయాన్ని షార్జా కోర్టు తేల్చింది. బాధితురాలికి వైద్యసేవల్ని అందించే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన డాక్టర్ నారాయణపై చర్యలు తీసుకోవాలన్న కోర్టు.. బాధితురాలి కుటుంబానికి రూ.39 లక్షలు పరిహారం ఇవ్వాలని.. మరో రూ.39 లక్షల మొత్తాన్ని కోర్టు ఖర్చుల కింద చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది.
కోర్టు తీర్పు కాపీని సన్నీ మెడికల్ సెంటర్ కు చెందిన డాక్టర్ దర్శన్ ప్రభాత్ రాజారాం.. పి. నారాయణకు అందజేసింది. ఆసుపత్రి చెల్లించే పరిహారాన్ని బ్లెస్సీ ఇద్దరు కుమారులకు సమానంగా పంచాలని పేర్కొంది. వైద్యసేవల్ని అందించటంలో నిర్లక్ష్యాన్ని ప్రదర్శించిన దుబాయ్ ఆసుపత్రికి షార్జా కోర్టు గట్టి మొట్టికాయ వేసిందని చెప్పాలి.