Begin typing your search above and press return to search.

ఆన్ లైన్ విచారణలో రాసలీలలు.. లాయర్ కు రూ.4 లక్షల ఫైన్

By:  Tupaki Desk   |   8 April 2022 10:31 AM GMT
ఆన్ లైన్ విచారణలో రాసలీలలు.. లాయర్ కు రూ.4 లక్షల ఫైన్
X
సమాజానికి న్యాయాన్ని అందించాల్సిన లాయర్లే అసభ్యంగా ప్రవర్తిస్తే ఇక సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్టు.. తాజాగా ఓ లాయర్ చేసిన పని అభాసుపాలైంది. ఆన్ లైన్ విచారణ వేళ ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించి అడ్డంగా బుక్కయ్యాడు. దీంతో అతడిపై కేసు నమోదుకావడమే కాదు.. భారీగా జరిమానా కూడా పడింది.

వర్చువల్ హియరింగ్ లో కెమెరా ఆన్ చేసి ఉందనే విషయం మర్చిపోయి మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన లాయర్ కు రూ.4లక్షలు జరిమానా విధించింది చెన్నై హైకోర్టు. ఈ మొత్తాన్ని బాధితురాలికి అందజేసింది.

కరోనా సమయంలో కోర్టులు ప్రత్యక్ష విచారణను తాత్కాలికంగా నిలిపివేసి ఆన్ లైన్ వేదికగా కేసుల వాదనలు విన్నాయి. చెన్నై హైకోర్టు ఓ కేసును వర్చువల్ గా విచారించినప్పుడు సంతాన క్రిష్ణన్ అనే న్యాయవాది తనతోపాటు ఉన్న ఓ మహిళతో అసభ్యంతగా ప్రవర్తించాడు.

తన ముందు కెమెరా ఆన్ చేసి ఉందనే విసయాన్ని కూడా మర్చిపోయి రెచ్చిపోయాడు. ఈ వీడియోను ఈ కేసులో హాజరైన మరో వ్యక్తి మొబైల్ లో రికార్డు చేశాడు. దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయగా తెగ వైరల్ అయ్యింది.

దీంతో చెన్నై హైకోర్టు జడ్జీలు, న్యాయవాదులు షాక్ కు గురయ్యారు. ఈ ఘటనను సుమోటోగా స్వీకరించిన చెన్నై హైకోర్టు సీబీఐసీఐడీతో విచారణ జరపాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో సీబీసీఐడీ అధికారులు కేసు నమోదు చేసి లాయర్ సంతాన కృష్ణన్ ను అరెస్ట్ చేశారు.

వాదనలు విన్న జస్టిస్ పీఎన్ ప్రకాష్ నేతృత్వంలోని ధర్మాసనం లాయర్ ను రూ.4 లక్షలు జరిమానా కట్టాలని ఆదేశించింది. ఆ మొత్తాన్ని బాధితురాలికి అందజేయాలని చెప్పింది. దీంతో ఏప్రిల్ 6న లాయర్ సంతాన కృష్ణన్ రూ. 4లక్షలను బాధితురాలికి పరిహారంగా ఇచ్చారు. అనంతరం జడ్జి కేసును వాయిదా వేశారు. తదుపరి విచారణపై ఎలాంటి తేదీలను ప్రస్తావించలేదు.