Begin typing your search above and press return to search.

రూ.2వేలు, రూ.500 నోట్ల పై నిషేధం

By:  Tupaki Desk   |   15 Dec 2018 5:19 AM GMT
రూ.2వేలు, రూ.500 నోట్ల పై నిషేధం
X
మోడీ నోట్ల రద్దు ఎఫెక్ట్ పక్క దేశం పై కూడా భారీగానే ప్రభావం చూపింది. ఇన్నాళ్లు ఇండియన్ రూపాయి కరెన్సీ నేపాల్ లో కూడా చెల్లుబాటు అయ్యేది.. అక్కడి గుర్ఖాలు భారత్ కు వచ్చినా.. ఇక్కడి వారు అక్కడికెళ్లినా భారత కరెన్సీ ని వాడుకునేవారు. కానీ ఇప్పుడు నేపాల్ ప్రభుత్వం భారత్ నోట్లు రద్దు చేసి కొత్తగా తీసుకొచ్చిన పెద్దనోట్లు రూ.2000, రూ.500, రూ.200 నోట్ల పై నిషేధం అమల్లోకి తీసుకొచ్చింది. ఈ మేరకు ఆ దేశ సమాచార ప్రసార శాఖ మంత్రి గోకుల్ భారత కరెన్సీలోని పెద్దనోట్ల పై నిషేధం విధిస్తున్నట్టు తాజాగా ప్రకటించారు.

రూ.100 కంటే ఎక్కువ విలువైన భారత కరెన్సీ కొత్త నోట్ల ను నేపాల్ ప్రభుత్వం చట్టబద్దం చేయలేదు. కొత్త నోట్లను అమలు చేస్తారని భావిస్తుండగా నేపాల్ ఈ షాకింగ్ నిర్ణయం తీసుకుంది.

భారత్ లో నోట్ల రద్దు ప్రభావం భారత ఆర్థికవ్యవస్థ పైనే కాదు.. పక్క దేశం నేపాల్ ఆర్థిక వ్యవస్థ పై కూడా తీవ్ర ప్రభావం చూపింది. ఆ తర్వాత భారత్ ప్రవేశపెట్టిన కొత్త నోట్లు రావడంతో అక్కడి మార్కెట్ లో చలామణీ అవుతున్నాయి. కానీ ఇప్పుడు నేపాల్ తీసుకున్న నిర్ణయంతో సామాన్యుల పై తీవ్ర ప్రభావం పడనుంది. భారత్ లో పనిచేసే నేపాలీ కూలీలు, గుర్ఖాలు భారత్ లోని పెద్ద నోట్ల తో వాళ్ల దేశానికి వెళ్లలేరు. మన దేశ పర్యాటకులు సైతం నిషేధం వల్ల ఇబ్బందులు పడకతప్పదు.