Begin typing your search above and press return to search.

కరోనా మృతుల కుటుంబాలకు రూ.50వేల పరిహారం

By:  Tupaki Desk   |   22 Sep 2021 5:30 PM GMT
కరోనా మృతుల కుటుంబాలకు రూ.50వేల పరిహారం
X
కరోనా కారణంగా భారతదేశంలో లక్షలాది మంది మరణించారు. సెకండ్ వేవ్ లో జనాలు పిట్టల్లా రాలారు. ఇప్పటికే కరోనాతో మరణించిన వారికి పరిహారం ఇవ్వాలని చాలా మంది సుప్రీంకోర్టుకెక్కారు. కోవిడ్ బారినపడి మరణించిన వారి కుటుంబాలకు నాలుగు లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని దాఖలైన పిటీషన్ పై విచారణ జరుపుతున్న నేపథ్యంలో కేంద్రం గతంలోనే కరోనా మృతుల కుటుంబాలకు నాలుగు లక్షల పరిహారం ఇవ్వలేమని చెప్పింది.

తాజాగా కరోనా కారణంగా మృతి చెందిన కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రూ.50వేల రూపాయల ఎక్స్ గ్రేషియా లభిస్తుందని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. ఈ మేరకు జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్.డీఎంఏ) ప్రతిపాదన చేసినట్లు కేంద్రం స్పష్టం చేసింది.

కరోనా రోగులకు సేవలు అందిస్తూ వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు కూడా పరిహారం ఇవ్వనున్నట్లు తెలిపింది. ఎక్స్ గ్రేషియా సహాయం, రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధి (ఎస్.డీ.ఆర్ఎఫ్) నుంచి రాష్ట్రాలే చెల్లిస్తాయని స్పష్టం చేసింది.

కోవిడ్ మరణ ధ్రువీకరణపై.. కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ, ఐసీఎంఆర్ మార్గదర్శకాలకు అనుగుణంగా పరిహారం అందించనున్నట్లు కేంద్రం తెలిపింది. ఈమేరకు సుప్రీంకోర్టుకు తెలిపింది.

ఇప్పటికే సంభవించిన మరణాలకు మాత్రమే కాకుండా భవిష్యత్తులో జరిగే మరణాలకు కూడా పరిహారం చెల్లించబడుతుందని కేంద్రం సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లింది. ఈ నిధులను రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లిస్తాయని.. రాస్ట్ర ప్రభుత్వాల సంబంధిత విపత్తు ప్రతిస్పందన నిధుల నుంచి ఈ పరిహారాలు చెల్లించబడుతాయని.. జిల్లా విపత్తు నిర్వహణ అథారిటీ లేదా జిల్లా పరిపాలన ద్వారా కుటుంబాలకు పరిహారం పంపించబడుతాయని ప్రభుత్వం ఈరోజు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్ లో పేర్కొంది.