Begin typing your search above and press return to search.
రాష్ట్రానికి రు. 60 వేల కోట్ల పెట్టుబడులు
By: Tupaki Desk | 24 May 2022 6:08 AM GMTరాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెట్టడానికి అదానీ గ్రూపు ముందుకొచ్చింది. రెండుడ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టడానికి అదానీ గ్రూపు ఛైర్మన్ గౌతమ్ అదానీ కంపెనీ రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహనా ఒప్పందం కుదుర్చుకున్నది. ప్రాజెక్టులకు సంబందించి జగన్మోహన్ రెడ్డి తరపున పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్, అదానీ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టు తరపున అశిష్ రాజ్ వంశీ అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశారు.
ఏకంగా రు. 60 వేల కోట్ల పెట్టుబెడులు పెట్టడానికి అదానీ గ్రూపు ముందుకురావటం మంచి పరిణామమనేచెప్పాలి. సుస్ధిరాభివృద్ధిలో భాగంగా కర్బన ఉద్గారాలు లేని ఆర్ధిక వ్యవస్ధను తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది.
దీనికి అనుగుణంగా కాలుష్యంలేని ఇందన ఉత్పత్తి లక్ష్యంగా రెండు మెగా గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల ఏర్పాటుకు అదానీ గ్రూపు ముందుకొచ్చింది. 3700 మెగావాట్ల సామర్ధ్యం గల పంప్డ్ స్టోరేజ్ హైడ్రో ప్రాజెక్టు, 10 వేల మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టులను అదానీ గ్రూపు ఏర్పాటు చేయబోతోంది.
పై రెండు ప్రాజెక్టుల విలువ రు. 60 వేల కోట్లుంటుందని కంపెనీ ప్రకటించింది. దీనివల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా 10 వేలమందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయని కూడా చెప్పింది. అలాగే విశాఖపట్నాన్ని టెక్నాలజీ హబ్ గా తీర్చిదిద్దటంలో టెక్ మహీంద్ర సహకరించటానికి అంగీకరించింది.
ఈ విషయాన్ని టెక్ మహీంద్ర సీఈవో, ఎండీ సీపీ గుర్నానీ స్వయంగా ప్రకటించారు. జగన్ తో భేటీ తర్వాత గుర్నానీ మాట్లాడుతు రు. 250 కోట్ల పెట్టుబడితో ఇథనాల్ తయారీ ప్లాంటు ఏర్పాటు చేయటానికి మహీంద్రా అనుబంధ సంస్ధ అసాగో ఇండస్ట్రీస్ ప్రైవేటు లిమిటెడ్ ముందుకొచ్చింది.
విద్యారంగంలో పెట్టుబడులు పెట్టేందుకు దస్సాల్ట్ సిస్టమ్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఫ్లోరెన్స్ వర్జలెన్స్ చెప్పారు. స్మార్ట్ పోర్టులు, కొత్త తరహా ఇంధనాలపైన జగన్ తో చర్చించినట్లు ఫోరెన్స్ తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే విషయంలో జపాన్ కు చెందిన అంతర్జాతీయ షిప్పింగ్ కంపెనీ మిట్సుయి ఓఎస్కే లైన్స్ ప్రెసిడెంట్, సీఈవో తకషీ హషిమోటో తెలిపారు.