Begin typing your search above and press return to search.
బేర్ విశ్వరూపం అంటే ఏమిటో చూపించింది.. రోజులో రూ.9లక్షల కోట్లు ఆవిరి
By: Tupaki Desk | 25 Jan 2022 5:32 AM GMTబేర్ విశ్వరూపం అంటే ఏమిటో సోమవారం స్టాక్ మార్కెట్ తో అనుబంధం ఉన్నవారందరికి మరోసారి అనుభవంలోకి వచ్చింది. మాయదారి మహమ్మారితో పాటు.. అంతర్జాతీయ.. జాతీయ ప్రతికూలత మధ్య దెబ్బ తిన్న సెంటిమెంట్ పుణ్యమా అని స్టాక్ మార్కెట్ భారీ నష్టాల్ని చవి చూసింది. గడిచిన రెండునెలల్లో అతి పెద్ద ఒక రోజు నష్టాన్ని చవిచూసిన రోజుగా జనవరి 24 నిలిచింది. సెన్సెక్స్ 1546 పాయింట్లు కోల్పోతే.. నిఫ్టీ ఏకంగా 468 పాయింట్లను కోల్పోవటం గమనార్హం. దీంతో.. స్టాక్ మార్కెట్ లో సంపద రూ.9.13లక్షల కోట్ల మొత్తం ఆవిరైంది.
మరో కీలకమైన అంశం ఏమంటే గడిచిన ఐదు రోజులుగా నేల చూపులు చూస్తోంది. సెన్సెక్స్ 3300 పాయింట్లు నష్టపోతే.. నిఫ్టీ 1100 పాయిట్లు నష్టపోవటం గమనార్హం. ఎందుకిలా జరిగింది? దీనికి కారణం ఏమిటి? అన్న విషయాల్లోకి వెళితే..
- అమెరికా ఫెడరల్ వడ్డీ రే్ల పెంపు సంకేతాలు
- రష్యా - ఉక్రెయిన్ ఉద్రిక్తతలు
- ద్రవ్యోల్బణ భయాలు
- బడ్జెట్ అంచనాల విషయంలో నెలకొన్న సందేహాలు
- కంపెనీల ఫలితాలు ప్రతికూలంగా ఉంటాయన్న వాదనలు
అన్ని కలిసి వచ్చినట్లుగా.. అంతటా ప్రతికూల పరిస్థితులు నెలకొన్నాయన్న మాటతో స్టాక్ మార్కెట్ తీవ్ర ఒడుదుడుకులకు లోనైంది. దీంతో.. మార్కెట్ భారీ నష్టాల్ని చవి చూసింది. స్టాక్ మార్కెట్ కు అనుగుణంగా డాలర్ తో పోలిస్తే రూపాయి మారకం విలువ మరింత తగ్గింది. వాస్తవానికి మార్కెట్ ఒకదశలో2050పాయింట్లు నష్టపోయింది. అనంతరం కాస్త కోలుకొని 1545 పాయింట్ల నష్టం వద్ద ట్రేడింగ్ ముగిసింది. గడిచిన ఐదు రోజుల్లో జరిగిన ట్రేడింగ్ తో మొత్తం రూ.19.50 లక్షల సొమ్ము హరించుకుపోయినట్లుగా చెబుతున్నారు.
సెన్సెక్స్ లో టాప్ 30 షేర్లలో ఏ ఒక్కటి లాభపడకపోవటం గమనార్హం. ఇదిలా ఉంటే.. ఇటీవల కాలంలో ఐపీవోలకు వచ్చిన కొత్త తరం కంపెనీల షేర్లు సోమవారం దారుణంగా ప్రభావితమయ్యాయి. జొమాటో షేరు 19.65 శాతం నష్టంతోముగిస్తే.. ఈ కామర్స్ సంచలనం నైకా షేరు 12.93 శాతం నష్టపోయింది. ఇవే కాక పలు కంపెనీలు 4-12 శాతం మధ్యలో నష్టపోయిన పరిస్థితి. ఈ రోజు (మంగళవారం) కూడా నష్టాల భయంతోనే మార్కెట్ ఉంటుందన్న అంచనాలు ఉన్నాయి.