Begin typing your search above and press return to search.
తెలంగాణ ప్రభుత్వం పై ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ఘాటు వ్యాఖ్యలు
By: Tupaki Desk | 10 Oct 2021 4:19 PM GMTఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ తెలంగాణ రాజకీయాల్లో కొత్త వరవడిని సృష్టిస్తున్నారు. ప్రస్తుత పార్టీలకు అతీతంగా బహుజన రాజ్యం అనే పేరుతో దూకుడుగా పోతున్నారు. అయితే ఏ మాట్లాడినా చాలా స్పష్టంగా సూటిగా హుందా తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఆయన ఏనుగెక్కి ప్రగతిభవన్‌లో పాగా వేయాలని చూస్తున్నారు. అందుకోసం తెలంగాణ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుని విమర్శలు సంధిస్తున్నారు. అయిజ మండలంలోని కొత్తపల్లి గ్రామంలో జరిగిన ఘటనపై ప్రవీణ్‌కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. గుడిసెలో నిద్రిస్తున్న ఏడుగురు వ్యక్తుల్లో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందడం బాధకరమన్నారు. సచివాలయం, ప్రగతిభవన్‌కు వందల కోట్లు ఖర్చు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం పక్కా ఇళ్లు నిర్మించి ఉంటే కొత్తపల్లి దుర్ఘటన జరిగేది కాదని చెప్పారు. వాస్తు పేరుతో భవనాలను కూలగొట్టి వందల కోట్లు ప్రజాధాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆక్షేపించారు.
అయిజ మండలంలోని కొత్తపల్లి గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున వర్షానికి నివాస గుడిసె కూలింది. ఈ ఘటనలో గుడిసెలో నిద్రిస్తున్న ఏడుగురిలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. తల్లిదండ్రులతో పాటు ముగ్గురు అక్కడికక్కడే సజీవ సమాధి అయ్యారు. మరో ఇద్దరు గాయాలతో బయటపడ్డారు. మృతులు మోష శాంతమ్మ భార్యాభర్తలతో పాటు వారి పిల్లలు తేజ, చరణ్, రామ్ అనే ముగ్గురు మృతి చెందారు. ప్రాణాలతో బయటపడ్డ చిన్నారి స్నేహ పెద్దగా ఏడవడంతో ఇరుగు, పొరుగు వారు వచ్చి స్నేహ(4)తో పాటు, చిన్న(3)ను కూడా బయటకు తీసుకొచ్చారు. ఇద్దరు చిన్నారులు బతికి బయటపడడానికి తల్లిదండ్రులు, అన్నలే కారణమయ్యారు. తల్లిదండ్రుల మధ్యన చిన్న పడుకున్నాడు. ఇద్దరు అన్నల మధ్యన స్నేహ నిద్రపోయింది. గోడకూలి ఇటుక పెళ్లలు పెద్దవారిపై పడటంతో, వారి మధ్య పడుకున్న ఇద్దరు చిన్నారులు గాయాలతో బయటపడ్డారు. చనిపోయిన వారికి కొత్తపల్గి గ్రామంలోని శ్మశాన వాటికలో పోస్టుమార్టమ్ నిర్వహించి అంత్యక్రియలు జరిపారు.
కొత్తపల్లి ఘటనపై సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఇన్‌చార్జి మంత్రి నిరంజన్‌రెడ్డికి ఫోన్‌చేసి మాట్లాడారు. మృతులకు ఒక్కొక్కరికి ఐదు లక్షల రూపాయల చొప్పున మొత్తం ఐదు మందికి రూపాయలు రూ.25 లక్షలు పరిహారం ప్రకటించారు. ప్రాణాలతో బయటపడ్డ వారికి మెరుగైన వైద్యసేవలు, విద్యను అందించాల్సిందని సూచించారు. అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహాం పార్టీ తరపున రెండు లక్షల రూపాయల సాయం ప్రకటించారు. మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్, ఇన్‌చార్జి ఎంపీపీ నాగేశ్వర్‌రెడ్డి 15,000, సింగిల్ విండో అధ్యక్షుడు పోతుల మధుసూదన్‌రెడ్డి 10,000 బాధిత అందచేశారు. మాజీ ఎంపీపీ తిర్మల్‌రెడ్డి రూపాయలు 2 లక్షలు అందచేస్తామని ప్రకటించారు. వివిధ రాజకీయ పార్టిల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కటుంబసభ్యులను పరామర్శించారు.