Begin typing your search above and press return to search.
హుజూరాబాద్ బరిలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్?
By: Tupaki Desk | 24 Aug 2021 2:30 PM GMTతెలంగాణలో హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో రాజకీయ పార్టీలు బిజీగా మారాయి. ఈ నియోజకవర్గంలో గెలిచేందుకు ఓ వైపు అధికార పార్టీ టీఆర్ఎస్ సంక్షేమ పథకాలు, నామినేటేడ్ పోస్టుల భర్తీలతో ఇక్కడి ప్రజలకు నజరానాలు కురిపిస్తోంది. మరోవైపు ఈసారి కూడా గెలిచేందుకు ఈటల రాజేందర్ బీజేపీ తరుపున రోజుకో ఊరు తిరుగుతూ ప్రజల్లోకి వెళుతున్నారు. ఇక కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించకపోయినా సమావేశాలు నిర్వహిస్తూ ప్రత్యేకంగా నిలుస్తోంది. అయితే ఇప్పటి వరకైతే గ్రౌండ్ లెవల్లో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగానే సాగుతోంది. అయితే తాజాగా ఇక్కడ బీఎస్పీ కూడా రంగంలోకి దిగనున్నట్లు సమాచారం. ఇక్కడ పోటీ చేయాలని ఆ పార్టీలో ఇటీవల చేరని ప్రవీణ్ కుమార్ పై ఒత్తిడి పెరుగుతుందట.
ఐపీఎస్ అధికారి అయిన ప్రవీణ్ కుమార్ గురుకుల కార్యదర్శిగా చేసి గత నెలలో వీఆర్ఎస్ తీసుకున్నాడు. ఆరు సంవత్సరాల ఉద్యోగ కాలం ఉండగానే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. ఇటీవల నల్గొండలో జరిగిన బహిరంగ సభలో బీఎస్పీలో చేరారు. దీంతో పార్టీ వర్గాల్లో ఉత్సాహం నెలకొన్నట్లయింది.ప్రవీణ్ కుమార్ గురించి తెలిసిన వారు, ఆయన అభిమానులు బీఎస్పీలో చేరుతున్నారు. ఆయన రాకతో పార్టీలో మార్పలు వచ్చే అవకాశం ఉందని సీనియర్ నాయకులు అనుకుంటున్నారు.
ఈనేపథ్యంలో ప్రవీణ్ కుమార్ ఉద్యోగం నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటన చేసిన సందర్భంలో హుజూరాబాద్ నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తలను ఆయన కొట్టిపారేశారు. తాను ఎక్కడినుంచి పోటీ చేయడం లేదని వివరణ ఇచ్చారు. అయితే ఆ తరువాత బీఎస్పీలో చేరిన తరువాత కూడా హుజూరాబాద్ లో పోటీ చేస్తారా..? అని అడిగితే అక్కడ పోటీ చేయమని తేల్చి చెప్పారు. కానీ బీఎస్పీలోని కొందరు సీనియర్ నాయకులు ఇక్కడ బీఎస్పీని బరిలోకి దించితే బాగుంటుందని ఒత్తిడి తీసుకొస్తున్నారట.
గురుకులాల కార్యదర్శిగా ఉన్న ప్రవీణ్ కుమార్ అనుచరులు, అభిమానులు ఇప్పటికే చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా ఆయన బహుజన సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో ఆ వర్గం వారు ప్రవీణ్ కుమార్ కు సపోర్టు చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. దీంతో హుజూరాబాద్లో పోటీలో ఉంటే కొంతైనా పార్టీకి బలం చేకూరుతుందని అంటున్నారు. అయితే ప్రవీణ్ కుమార్ నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది.
హుజూరాబాద్ నియోజకవర్గంలో 50 వేలకు పైగా దళిత ఓట్లున్నాయి. అధికార టీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే ఆ విషయాన్ని గ్రహించి దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టింది. అందుకు సంబంధించి వెయ్యి కోట్ల రూపాయల నిధులను కూడా జారీ చేసింది. దీంతో దళిత ఓట్లు తమకేనని భావిస్తోంది. ఇక మిగతా వర్గానికి చెందిన వారికి నామినేటెడ్ పదవులు ఇస్తూ వారిని సంతృప్తి పరుస్తోంది. తాజాగా వకుళా భరణంకు బీసీ కార్పొరేషన్ పదవిని కట్టబెట్టింది. ఓవరాల్ గా దళిత ఓట్లు అధికంగా ఉండడంతో వారిని ఆకట్టుకునే విధంగా ప్రయత్నిస్తోంది.
ఈ నేపథ్యంలో ఇక్కడ దళిత బంధు దక్కని వారు, ఇతరుల ఓట్లను చీల్చేందుకు బీఎస్పీ పోటీ చేయాలని భావిస్తోందట. ఈనెల 26న కరీంనగర్ లో బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభలో ప్రవీణ్ కుమార్ చెప్పిన దానిని భట్టి ఇక్కడ బీఎస్పీ బరిలో ఉంటుందా..? లేదా..?అనేది తేలిపోతుంది. ఒకవేళ ప్రవీణ్ కుమార్ ఇక్కడ పోటీకీ సై అంటే మాత్రం టీఆర్ఎస్, బీజేపీలకు దెబ్బ పడే అవకాశం ఉందని చర్చించుకుంటున్నారు. అయితే ఇక్కడ టీఆర్ఎస్, బీజేపీ మధ్యే ప్రధాన ఫైట్ అని తెలుస్తోంది. కాంగ్రెస్ కూడా పోటీ చేయడానికి తర్జనభర్జన పడుతోంది. ఈ నేపథ్యంలో బీఎస్పీ ఎలాంటి హామీలతో రంగంలోకి దిగుతుందో చూడాలి.