Begin typing your search above and press return to search.
కేరళ కమలం నేత... మోదీ పరువు తీశారే!
By: Tupaki Desk | 20 July 2017 8:54 AM GMTగడచిన ఎన్నికల్లో అవినీతి రహిత పాలనతో పాటు దేశంలోని నల్ల కుబేరులు స్విస్ బ్యాంకుల్లో దాచుకున్న లక్షల కోట్ల నల్లధనాన్ని దేశానికి తిరిగి రప్పిస్తామని బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోదీ చేసిన ప్రకటనకు జనం నుంచి భారీ స్పందనే లభించింది. ఆ స్పందనకు అనుగుణంగానే బీజేపీ అభ్యర్థులకు ఓట్లు గుట్టలుగుట్టలుగా పోలయ్యాయి. అయితే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అవినీతిరహిత పాలనకు మోదీ శ్రీకారం చుట్టారనే చెప్పాలి. ఎందుకంటే... పెద్ద నోట్ల రద్దు, ఆన్‌లైన్ చెల్లింపుల వైపు జనాన్ని మొగ్గేలా చేయడం, జీఎస్టీ అమలు తదితర నిర్ణయాలతో దేశంలో అవినీతి కొంతమేర తగ్గిందనే చెప్పాలి.
అదే సమయంలో అక్రమంగా సంపాదించిన సొమ్మును గుట్టుగా దాచేసిన బడా బాబుల భరతం పట్టేందుకు మోదీ సర్కారు ఆదాయపన్ను శాఖకు సంపూర్ణ అధికారులు ఇచ్చేసింది. నల్ల ధనాన్ని పోగేసిన వారు తన వారా? పరాయి వారా? అన్న తేడా లేకుండా నల్ల కుబేరులను కుమ్మేయండంటూ మోదీ సర్కారు ఇచ్చిన ఆదేశాలు ఇప్పుడు నల్ల కుభేరుల్లో వణుకు పుట్టిస్తున్నాయి. మోదీ సర్కారు చర్యలతో నల్ల కుబేరుల్లో వణుకు అయితే పుట్టింది గానీ... మోదీ సొంత పార్టీ నేతలు మాత్రం ఇంకా దారికి రానట్టుగా కనిపిస్తోంది. ఇందుకు నిదర్శనంగా నిలిచే ఘటన ఇప్పుడు కేరళలో వెలుగులోకి వచ్చింది.
ఓ బీజేపీ నేతగా ఉంటూ మోదీ సర్కారు తలెత్తుకుని పాలించేలా వ్యవహరించాల్సిన బీజేపీ కేరళ శాఖకు చెందిన కోఆపరేటివ్ సెల్ కన్వీనర్ ఆర్ ఎస్ వినోద్ అందుకు విరుద్ధంగా వ్యవహరించారు. మోదీ సర్కారు పరువు తీసే పనిచేసిన ఆయన ఇప్పుడు విపక్షాలకు అవకాశం ఇచ్చేశారు. వినోద్ అవినీతి భాగోతం విషయానికి వస్తే... కేరళలోని వర్కలలో కార్యకలాపాలు సాగిస్తున్న ఎస్ ఆర్ ఆసుపత్రికి మెడికల్ కాలేజీ హోదా ఇప్పించేందుకు రంగంలోకి దిగారు. అందుకోసం ఆయన ఆసుపత్రి యాజమాన్యం నుంచి భారీ ఎత్తున ముడుపులు స్వీకరించారు. కేవలం ఆసుపత్రికి మెడికల్ కాలేజీ హోదా ఇప్పించేందుకు ఆయన ఏకంగా రూ.5.6 కోట్లను లంచంగా స్వీకరించారట.
మెడికల్ కాలేజీకి అనుమతి కావాలంటే... మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) నుంచి గ్రీన్ సిగ్నల్ రావాల్సి ఉంది. ఇదే విషయాన్ని ఆసరా చేసుకుని వినోద్ ఈ భారీ దందాకు తెర తీశారు. ఇక ఈ విషయం వెలుగుచూడటానికి విపక్షాలో, లేదంటే అధికారులో కారణం కాదు. స్వయానా బీజేపీ దర్యాప్తు బృందం చేపట్టిన విచారణలోనే ఈ విషయం బయటకు వచ్చింది. సొంత పార్టీ దర్యాప్తు బృందం చేపట్టిన విచారణలో ఈ విషయం నిగ్గు తేలగా... వినోద్ అంటే పడని ఆ పార్టీ నేతలే ఇప్పుడు ఈ విషయాన్ని మీడియాకు లీక్ చేసేశారు. ఇప్పుడు ఈ విషయం కేరళ రాజకీయాల్లో పెను దుమారమే రేపుతోంది. ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు జరపాలని ప్రత్యర్థి పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి.