Begin typing your search above and press return to search.
టీడీపికి ఎన్నారైల నుంచి రూ.500 కోట్లు..?
By: Tupaki Desk | 4 Jan 2023 5:06 AM GMTమరో ఏడాదిలో ఏపీలో ఎన్నికలు సాగనున్నాయి. మరోసారి గద్దెనెక్కేందుకు వైసీపీ సర్కార్ రకరకాల ప్రయత్నాలు చేస్తోంది. ఒక్కసారైనా అధికారంలోకి రావాలని జనసేన తహతహలాడుతోంది. ఈ నేపథ్యంలో ఇన్నాళ్లు ప్రధాన ప్రతిపక్షంగా కొనసాగుతున్న తెలుగుదేశం పార్టీ ప్రజలను ఆకట్టుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. అయితే ఇటీవల నిర్వహించిన రోడ్ షో, సంక్రాంతి కానుకల పంపిణీ సందర్భంగా జరిగిన సంఘటనలు సైకిల్ పార్టీకి మచ్చ తెచ్చాయి.
అయినా ఈసారి అధికారంలోకి రావాలని పార్టీ అధినేత చంద్రబాబు విభిన్న వ్యూహాలు పన్నుతున్నారు. లేటెస్టుగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం ఎన్నారైలు మిలియన్ డాలర్ల డబ్బులు అందించేందుకు రెడీ అవున్నారని ఓ మీడియాలో వార్తలు ప్రసారం అయ్యాయి. అయితే ఇది ఎంతవరకు నిజం అన్నది తేలాల్సి ఉంది.
స్వర్గీయ ఎన్టీరామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీకి ఆయన అల్లుడైన చంద్రబాబు నాయుడు వారసుడిగా వచ్చాడు. సుధీర్ఘ కాలం పార్టీని నడిపిస్తూ తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వరుసగా 9 సంవత్సరాలు అధికారంలో ఉన్నఆయన ఆ తరువాత మరో పదేళ్లు ప్రతిపక్ష నాయకుడిగానే కొనసాగారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత విభజిత ఏపీలో 2014లో మరోసారి అధికారంలోకి వచ్చారు. తెలుగుదేశం పార్టీ రెండు సార్లు ఓడిపోయినా మరోసారి అధికారంలోకి రావడం పెద్ద కష్టమేమీ కాలేదు. పార్టీకి ఉన్న స్టాటజీ అలాంటిది. కానీ 2024లో కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఎందుకంటే పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి ఇవే చివరి ఎన్నికలు. ఈ విషయం ఆయనే ప్రజలకు నేరుగా చెబుతున్నారు. ఈ ఒక్కసారి అవకాశం ఇవ్వండి.. ఆంధ్రప్రదేశ్ స్థితిగతులను మార్చేస్తామని అంటున్నారు. అటు పార్టీ నాయకులు సైతం ఈసారి అధికారంలోకి వస్తే ఎంతో కొంత లాభం ఉంటుందని ఎదురుచూస్తున్నారు. దీంతో బాబుతో పాటు కేడర్ సైతం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు శత విధాలుగా ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీ ఖర్చుల కోసం ఇప్పటి నుంచే నిధులు సేకరించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం.
ఇందులో భాగంగా ఎన్నారైలు చంద్రబాబు గెలుపు కోసం సహకారం చేస్తున్నట్లు సమాచారం. టీడీపీ ఎన్నారైలంతా కలిసి 500 కోట్ల రూపాయలు సమకూర్చే అవకాశం ఉందని అంటున్నారు. కేవలం అమెరికాలోని వారే కాకుండా వివిధ దేశాల్లోని వారంతా ఇప్పుడు డబ్బు సేకరించే పనిలో ఉన్నారట. సాధారణంగా పార్టీ ఫండ్ ను ఏ నాయకుడైనా సేకరిస్తారు. కానీ ఈసారి మాత్రం ఎన్నారైలు రంగంలోకి దిగడం చర్చనీయాంశంగా మారింది.
2024 గనుక మిస్సయితే ఇక టీడీపీ భవిష్యత్ ప్రశ్నార్థకమని కొందరు ఆందోళన చెందుతుననారు. ఎందుకంటే ఇన్నాళ్లు తన భుజాన వేసుకున్న చంద్రబాబు వయసురీత్యా రాజకీయాల నుంచి తప్పుకునే అవకాశం ఉంది. ఆ తరువాత పార్టీ బాధ్యతలను తన కుమారుడికి అప్పగిస్తారని అంటున్నారు. కానీ చంద్రబాబులా లోకేశ్ మెయింటేన్ చేస్తాడా..? అనేది ఇప్పుడే తెలియని విషయం. దీంతో 2024లో ఎలాగైనా టీడీపీ గెలవాలని చంద్రబాబే కాకుండా చాలా మంది కోరుకుంటున్నట్లు సమాచారం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.