Begin typing your search above and press return to search.

చేయి న‌రికి ప్ర‌తిప‌క్ష కార్య‌క‌ర్త‌ను హ‌త్య చేశారు

By:  Tupaki Desk   |   30 July 2017 9:25 AM GMT
చేయి న‌రికి ప్ర‌తిప‌క్ష కార్య‌క‌ర్త‌ను హ‌త్య చేశారు
X
వామ‌ప‌క్ష పార్టీ అధికారంలో ఉన్న కేర‌ళ‌లో శ‌నివారం రాత్రి జ‌రిగిన రాజ‌కీయ హ‌త్య రాష్ట్రంలో దుమారం రేపుతోంది. తిరువ‌నంత‌పురం కు చెందిన ఆర్ ఎస్ ఎస్ కార్య‌క‌ర్త రాజేశ్ (34) చేయి న‌రికి మరీ హ‌త్య చేశారు. నివారం రాత్రి 9 గంట‌ల ప్రాంతంలో రాజేశ్ పై దాడి జ‌రిగిన‌ట్లు స‌మాచారం. ఆర్ ఎస్ ఎస్ కార్య‌క‌ర్త హ‌త్య‌కు నిర‌స‌న గా స్టేట్ బీజేపీ రాష్ట్ర‌వ్యాప్తంగా ఇవాళ స‌మ్మేను నిర్వ‌హిస్తోంది. శ‌"సీపీఎం పార్టీ యాక్టివిస్టుల గ్యాంగ్ ఈ దారుణానికి ఒడిగ‌ట్టింది. ఈ హ‌త్య తో సంబంధ‌ముంద‌న్న ఆరోప‌ణ‌ల‌తో ఐదుగురు వ్య‌క్తుల‌ను ఇప్ప‌టికే అరెస్ట్ చేశాం. ఈ హ‌త్య రాజ‌కీయ కోణంలో జ‌రిగిందా.. లేక వాళ్ల మ‌ధ్య ఏదైనా శ‌తృత్వం ఉందా అనే కోణంలో విచారిస్తున్నామ‌ని" ఇన్ స్పెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ ఆఫ్ పోలీస్ మ‌నోజ్ అబ్ర‌హం చెబుతున్నారు.

అయితే... ఈ హ‌త్య జ‌ర‌గ‌డానికి రెండు రోజుల ముందే బీజేపీ స్టేట్ ఆఫీసుపై దాడి జ‌రిగింది. ఆ తర్వాత సీపీఎం స్టేట్ సెక్ర‌ట‌రీ కొడియెరి బాల‌కృష్ణ‌న్ కొడుకు ఇంటిపైనా దాడి జ‌రిగింది. ఈ రెండు దాడులు కూడా తిరువ‌నంత‌పురంలోనే జ‌ర‌గ‌డం.. హ‌త్య కూడా ఇక్క‌డే కావ‌డంతో ఆ కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. గురువారం సాయంత్రం నుంచే లెఫ్ట్ యూత్ వింగ్ ప‌తాకాన్ని అవ‌న‌తం చేయ‌డంతో గొడ‌వ‌లు ప్రారంభ‌మ‌య్యాయి. దీంతో ఇటు బీజేపీ - సీపీఎం వ‌ర్క‌ర్ల ఇళ్ల‌ల్లో దాడులు జర‌గ‌డం తో వెంట‌నే ఆర్ ఎస్ ఎస్ - సీపీఎం కార్య‌క‌ర్త‌ల‌ను అరెస్ట్ చేశారు పోలీసులు. అయితే... శుక్ర‌వారం బీజేపీ స్టేట్ ఆఫీసు పై సీపీఐ లీడ‌ర్లు రాళ్లు విసిరిన వీడియోను బీజేపీ రిలీజ్ చేసింది. ఇవ‌న్నీ సంఘ‌ట‌న‌లు జ‌రిగిన నేప‌థ్యంలో జ‌రిగిన ఈ హ‌త్య పై కేర‌ళ రాజ‌కీయాల్లో కొంత ఆందోళ‌న క‌లిగించే అవ‌కాశం ఉందని అంటున్నారు.

కాగా, కేరళలో ఆర్ ఎస్ ఎస్ కార్యకర్త హత్యపై కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ స్పందించారు. ప్రజాస్వామ్యంలో రాజకీయ హత్యలకు తావులేదని అన్నారు. హ‌త్య అనంత‌రం ఆయన కేరళ ముఖ్యమంత్రి పినరవి విజయన్ తో ఫోన్ లో మాట్లాడారు. రాష్ట్రంలో బీజేపీ కార్యకర్త హత్యకు సంబంధించిన వివరాలను ఆయన సీఎంను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో కఠినంగా ఉండాలని సూచించారు.