Begin typing your search above and press return to search.

ప‌ర్యావ‌ర‌ణ హితం పేరిట కొత్త‌గా బ‌క్రీద్ వేడుక‌లు!

By:  Tupaki Desk   |   23 Aug 2018 6:42 AM GMT
ప‌ర్యావ‌ర‌ణ హితం పేరిట కొత్త‌గా బ‌క్రీద్ వేడుక‌లు!
X
హిందుత్వ వాదులు.. హిందుత్వ వాదులంటూ ఎట‌కారం చేసుకోవ‌టం.. వారిని సంఘ విద్రోహ శ‌క్తులుగా అభివ‌ర్ణించే ప్ర‌ముఖులు కొంద‌రు క‌నిపిస్తుంటారు. అయితే.. ఇలాంటి మాట‌ల్ని ప‌ట్టించుకోకుండా హిందూ స‌మాజం అంత‌కంత‌కూ ఒక చ‌ట్రం ప‌రిధిలోకి వెళ్లిపోవ‌టానికి కార‌ణం.. కొంద‌రు మేధావుల తీరేన‌ని చెబుతారు.

న్యాయం ఎవ‌రికైనా ఒకేలా ఉండాలి. ఒక‌రికి ఒక‌లా.. మ‌రొక‌రికి మ‌రోలా అస్స‌లు ఉండ‌కూడ‌దు. కానీ.. కొంద‌రు మేధావులు హిందువుల పండుగ‌ల్ని టార్గెట్ చేస్తున్నార‌ని.. మిగిలిన మ‌త‌స్తుల పండ‌గ‌ల్ని పెద్ద‌గా ప‌ట్టించుకోక‌పోవ‌టాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌డుతున్నారు. హోలీకి రంగులు వాడొద్ద‌ని.. వినాయ‌క‌చ‌వితికి మ‌ట్టి విగ్ర‌హాలు వాడాల‌ని.. ప‌త్రి పేరుతో చెట్ల‌ను కొట్టేయొద్ద‌ని.. దీపావ‌ళికి.. శ‌బ్ద‌.. వాయు కాలుష్యంతో ప‌ర్యావ‌ర‌ణాన్ని దెబ్బ తీస్తున్నారంటూ పెద్ద ఎత్తున ప్ర‌చారం చేస్తుంటారు.

ఇవ‌న్నీ వాస్త‌వాలే అయినా.. అన్ని పండుగ‌ల్లో ఉన్న లోపాల్ని ఇదే తీరులో ఎత్తి చూపించాలి. కానీ.. అలాంటిదేమీ చేయ‌క‌పోవ‌టంపై ప‌లువురు హిందువులు అభ‌ద్ర‌తాభావానికి గురి కావ‌టం.. త‌మ‌నే ల‌క్ష్యంగా తీసుకుంటున్నార‌న్న భావ‌న‌కు గురి అవుతున్న ప‌రిస్థితి నెల‌కొంది.

ప్ర‌పంచ వ్యాప్తంగా చూస్తే.. ప‌ర్యావ‌ర‌ణానికి హాని క‌లిగించే కాలుష్యం జంతువ‌ధ నుంచేన‌న్న స‌త్యం బోధ ప‌డుతుంది. ఒక కేజీ మాంసం త‌యారు కావ‌టానికి భారీ ఎత్తున ప‌చ్చ‌ద‌నం హ‌న‌నం జ‌రుగుతుంద‌ని.. వాటి వ్య‌ర్థాల కార‌ణంగా ప‌ర్యావ‌ర‌ణానికి భారీ న‌ష్టం వాటిల్లుతుంద‌న్న అభిప్రాయం ఉంది.

ఇలాంటివేళ‌.. వినాయ‌క‌చ‌వితి వేళ‌.. విగ్ర‌హాల విష‌యంలో ఎలాంటి చైత‌న్యాన్ని తెచ్చే ప్ర‌య‌త్నం చేస్తారో.. బ‌క్రీద్ వేళ‌.. మూగ జీవాల్ని బ‌లి ఇవ్వ‌టం స‌రికాద‌న్న అభిప్రాయం ఉంది. ఇదే విష‌యాన్ని తాజాగా ముస్లిం రాష్ట్రీయ మంచ్ వాదిస్తోంది. సంఘ్ ప‌రివార్ సోద‌ర సంస్థ అయిన ఈ సంస్థ‌కు చెందిన ప్ర‌తినిధులు.. బ‌క్రీద్ వేళ‌.. మూగ‌జీవాల్ని బ‌లి ఇవ్వ‌టం స‌రికాద‌న్న వాద‌న‌ను వినిపిస్తోంది.

దేశంలోని 13 ల‌క్ష‌ల మంది మంచ్ స‌భ్యులు బ‌క్రీద్ ను ఈసారి వినూత్నంగా నిర్వ‌హించారు. ప‌ర్యావ‌ర‌ణ అనుకూలంగా గొర్రె బొమ్మ‌తో ఉన్న కేక్ ను క‌ట్ చేసి బ‌క్రీద్ పండుగ‌ను నిర్వ‌హించారు. ఖురాన్ ఎప్పుడూ జంతువుల‌ను వ‌ధించాల‌న్న విష‌యాన్ని చెప్ప‌లేద‌ని.. మ‌నుషులంతా జంతువులు.. ప‌క్షుల‌పై ప్రేమ చూపాల‌నే చెప్పింద‌న్నారు. అయితే.. ఈ వాద‌న‌ను ల‌క్నో ఈద్గా ఇమాం ర‌షీద్ ఫారంగీ ఖండించారు. తాము బ‌క్రీద్ సంద‌ర్భంగా జంతువుల్ని వ‌ధించామ‌ని..ఈ విష‌యంలో ఎవ‌రూ జోక్యం చేసుకోవ‌టానికి వీల్లేద‌ని షియా మ‌త‌పెద్ద‌లు వ్యాఖ్యానించ‌టం చూసిన‌ప్పుడు.. ప్ర‌జాస్వామ్యంలో త‌ప్పొప్పుల మీద చ‌ర్చ జ‌ర‌గాల్సిన అవ‌స‌రం లేదా? అన్న సంశ‌యం రాక మాన‌దు.