Begin typing your search above and press return to search.
ఆరెస్సెస్ చీఫ్ ఆ మసీదుకు వెళ్తారట
By: Tupaki Desk | 30 March 2016 9:00 AM GMTఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ ఓ మసీదును సందర్శించబోతున్నారు. లక్నోలోని ఆ మసీదును దర్శించుకుంటానని ఆయన మాట కూడా ఇచ్చారు. ఆశ్చర్యపోతున్నారా...? ఆరెస్సెస్ చీఫ్ మసీదు సందర్శనకు మక్కువ చూపించడమేంటని అనుకుంటున్నారా? కానీ.. అది నిజమే... లక్నోలో కొత్తగా నిర్మించిన ఒక మసీదును సందర్శించేందుకు మోహన్ భగవత్ సిద్ధమవుతున్నారు.
ఉత్తరప్రదేశ్ లోని మోహన్ లాల్ గంజ్ లోని మాధో ఆశ్రమంలో జరిగిన ఒక కార్యక్రమానికి భగవత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆల్ ఇండియా ముస్లిం వుమన్ లా బోర్డు చైర్ పర్సన్ పైస్తా అంబర్ ఆయన్ని కలిశారు. మాధో ఆశ్రమానికి సమీపంలో తాను నిర్మించిన మసీదును సందర్శించాలని భగవత్ ను అంబర్ కోరగా, అందుకు ఆయన ఓకే చెప్పారు. ఈసారి లక్నో వచ్చినప్పుడు మసీదును తప్పకుండా సందర్శిస్తానని హామీ ఇచ్చారు.
దేశమంతా బీజేపీ, అరెస్సెస్ కు వ్యతిరేకంగా అసహన ఆరోపణలు వినిపిస్తున్న సమయంలో ఇలా ముస్లిం ప్రతినిధులు ఆరెస్సెస్ చీఫ్ ను కోరడం.. ఆయన కూడా మసీదుకు వస్తానని చెప్పడం ఎంతైనా ఆరోగ్యకర పరిణామమే.