Begin typing your search above and press return to search.

మోడీ సర్కార్ పై ఆర్ఎస్ఎస్ చీఫ్ సంచలన కామెంట్స్

By:  Tupaki Desk   |   16 May 2021 5:45 AM GMT
మోడీ సర్కార్ పై ఆర్ఎస్ఎస్ చీఫ్ సంచలన కామెంట్స్
X
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. దాని వెనుకుండి నడిపించే ఆర్ఎస్ఎస్ ఎప్పుడూ వేరు వేరు కాదు.. అవి రెండూ ఒకటే. కానీ దేశంలో మోడీషాల అధికారం వచ్చాక ఆర్ఎస్ఎస్ ప్రభావం తగ్గిపోయిందన్న విమర్శ ఉంది. ఆర్ఎస్ఎస్ ను పక్కనపెట్టి మోడీషాలే నిర్ణయాలు తీసుకుంటున్న ప్రచారం ఉంది.

ఈ క్రమంలోనే తాజాగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కేంద్రప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా మొదటి వేవ్ తర్వాత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందన్నారు. కరోనా కట్టడిలో మోడీ సర్కార్ వైఫల్యం చెందిందని ప్రతిపక్షాలు, అంతర్జాతీయ మీడియా విమర్శిస్తున్నవేళ ఆర్ఎస్ఎస్ చీప్ చేస్తున్న ఈ వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.

కరోనా వైరస్ నుంచి ప్రజల్లో ఆత్మవిశ్వాసం నింపేందుకు ‘పాజిటివిటీ అన్ లిమిటెడ్’ పేరిట ఆర్ఎస్ఎస్ ఏర్పాటు చేసిన వర్చువల్ కార్యక్రమంలో మోహన్ భగవత్ మాట్లాడారు. ‘కరోనా మొదటి వేవ్ తర్వాత ప్రభుత్వం, అధికార యంత్రాగం, ప్రజలు అందరూ తమ బాధ్యత మరిచారని.. ఓవైపు రెండే వేవ్ సంకేతాలు ఉన్నా వైద్యులు సూచించినా ఎవరూ పట్టించుకోలేదు’ అని మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు.

రేపు థర్డ్ వేవ్ కూడా రావచ్చని చెబుతున్నారని.. కాబట్టి మనం భయపడుదామా? లేక సరైన ధోరణితో కరోనాపై పోరాడుదామా? అని మోహన్ భగవత్ ప్రశ్నించారు. ఇప్పటి అనుభవాల నుంచైనా ప్రభుత్వం, ప్రజలు పాఠాలు నేర్చుకొని భవిష్యత్తులో వచ్చే ముప్పును ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని మోహన్ భగవత్ పేర్కొన్నారు. భారతీయులు ఇప్పటికైనా పాఠాలు నేర్చుకొని ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. భారతీయులు కరోనాపై విజయం సాధించాల్సిన అవసరం ఉందని భగవత్ పేర్కొన్నారు.

ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో మే 11 నుంచి ఐదురోజుల పాటు ‘పాజిటివిటీ అన్ లిమిటెడ్’ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. వర్చువల్ గా జరుగుతున్న ఈ కార్యక్రమంలో విప్రో అధినేత, ఆధ్యాత్మిక గురువు జగ్గీ వాసుదేవ్ పాల్గొంటున్నారు.