Begin typing your search above and press return to search.
రిమోట్ లేకున్నాసిగ్నల్స్ గురించి ఒప్పేసుకున్నారు
By: Tupaki Desk | 18 March 2016 4:42 AM GMTమోడీ సర్కారుకు అదృశ్య శక్తిగా సంఘ్ వ్యవహరిస్తుందన్న ఆరోపణ ఇప్పటిది కాదు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన ప్రతిసారీ సంఘ్ పరివార్ పేరు తెర మీదకు వస్తుంది. బీజేపీ పాలకులు తీసుకునే చాలా నిర్ణయాల వెనుక సంఘ్ అదృశ్య హస్తం ఉంటుందని.. దాని చెప్పుచేతల్లోనే నిర్ణయాలు ఉంటాయన్న వాదనలో నిజం ఉందన్న విషయం తాజాగా బయటకు వచ్చింది. ఆ మాటకు వస్తే.. ఆ సీక్రెట్ ను ఆర్ ఎస్ ఎస్ బహిరంగంగా ఒప్పుకోవటం విశేషం.
అయితే.. తాము రిమోట్ మాదిరి కంట్రోల్ చేయమని.. అవసరమైనప్పుడు సంకేతాలు మాత్రమే ఇస్తామంటూ సంఘ్ పేర్కొనటం గమనార్హం. ఒక మీడియా సంస్థ నిర్వహించిన కార్యక్రమానికి హాజరైన ఆర్ ఎస్ ఎస్ సంయుక్త ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబలే మాట్లాడుతూ కీలకమైన విషయాన్ని నర్మగర్భంగా చెప్పుకొచ్చారు.
‘‘ఇక్కడ ఎవరూ ఎవర్నీ కంట్రోల్ చేయటం లేదు. రిమోట్ అయితే ఉంది. సిగ్నల్స్ కూడా ఉన్నాయి. బీజేపీని కానీ ఏ ఇతర రాజకీయ పార్టీని రిమోట్ కంట్రోల్ ద్వారా నియంత్రించాలని ఆర్ ఎస్ ఎస్ అనుకోదు. ప్రజాస్వామ్యంలో ఇతర సంస్థలకు మాదిరే.. ప్రభుత్వానికి సలహాలు.. సూచనలు ఇవ్వటం హక్కుగా భావిస్తాం’’ అంటూ చెప్పుకొచ్చారు. కంట్రోల్ చేయరు కానీ.. సిగ్నల్స్ ఉంటాయన్న విషయాన్ని ఎంత బాగా చెప్పారో కదూ. అనుకుంటాం కానీ.. ఇంతకంటే ఓపెన్ గా ఎవరు మాత్రం చెప్పగలరు?