Begin typing your search above and press return to search.
ఆర్ ఎస్ ఎస్ రివర్స్ గేర్
By: Tupaki Desk | 28 Jun 2016 6:59 AM GMTరాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ తాజా నిర్ణయం వివాదాస్పదంగా మారింది. రంజాన్ నేపథ్యంలో ముస్లింలకు ఆర్ ఎస్ ఎస్ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం పట్ల బీజేపీ మిత్రపక్షమైన శివసేన ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం ద్వారా ఆరెస్సెస్ ముస్లింలను బుజ్జగించే పనిలో పడినట్లు ఉందని శివసేన పేర్కొంది. ఆ పార్టీ రివర్స్ గేర్ వేసిందని వ్యాఖ్యానించింది.
హిందూ దేశాన్ని ఏర్పాటు చేయాలనే తమ భావజాలానికి సంబంధించి ఆరెస్సెస్ అయోమయస్థితిలో పడినట్లుందని శివసేన నేత మనీషా కయాండే పేర్కొన్నారు. హిందూ దేశాన్ని ఏర్పాటు చేయాలని కోరుతున్న ఆరెస్సెస్ ఇఫ్తార్ విందు ఇవ్వడంలో ఔచిత్యమేమిటని కయాండే ప్రశ్నించారు. గతంలో కాంగ్రెస్ తో పాటు ఇతర పార్టీలు ఇఫ్తార్ విందులు ఇచ్చినప్పుడు మతరాజకీయాలు అంటూ విమర్శించిన ఆర్ఎస్ఎస్ ఇప్పుడు తాను స్వయంగా ఇఫ్తార్ విందు ఇవ్వడం ఆశ్చర్యం కలిగిస్తోందని కయాండే వ్యాఖ్యానించారు. తన అడుగులు ఎటువైపుగా పడుతున్నాయో ఆర్ఎస్ఎస్ అర్థం చేసుకోవాలని అన్నారు.