Begin typing your search above and press return to search.
సంఘ్ నోట కొత్త మాట.. దేశంలోని 99 శాతం ముస్లింలు హిందూస్థానీలే
By: Tupaki Desk | 14 Nov 2022 3:29 AM GMTఆర్ఎష్ఎస్ అన్నంతనే అది హిందువులకు సంబంధించిన సంస్థ అని.. ముస్లిం మైనార్టీల మీద తన కోపాన్ని.. అసహనాన్ని వ్యక్తం చేస్తుంటుందన్న తప్పుడు ప్రచారం నడుస్తూ ఉంటుంది. వాస్తవానికి ఇందుకు భిన్నమైన వాతావరణం సంఘ్ లో ఉంటుందని దాని గురించి తెలిసిన వారు.. దానితో మమేకం అయినోళ్లు చెబుతుంటారు. వాస్తవానికి సంఘ్ పరివార్ లో హిందువులకే కాదు.. ముస్లిం మైనార్టీలకు ఒక శాఖ ఉందన్న విషయం చాలా మందికి తెలీదు.
తాజాగా ఆర్ఎస్ఎస్ నిర్వహించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ లో భాగంగా సంఘ్ నేత ఇంద్రేశ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్య చేశారు. సంస్కృతీ సంప్రదాయాలతో పాటు పూర్వీకుల పరంగా భారత దేశంలోని 99 శాతం ముస్లిలు హిందూస్థానీయులేనని స్పష్టం చేసింది.
ముస్లింల విషయంలో తమకు ఎలాంటి వ్యతిరేకత లేదని.. వారితో కలిసి మెలిసి ఉండాలన్నదే తమ లక్ష్యమన్న విషయాన్ని ఆయన స్పష్టం చేశారని చెప్పాలి.
భారత్ లోని అందరి పూర్వీకులు ఒకరేనని.. అందరి డీఎన్ఏ ఒకటేనని పేర్కొన్న ఆయన.. మహారాష్ట్ర లోని థానే జిల్లా ఉత్తాన్ లో ముస్లిం రాష్ట్రీయ మంచ్ ను ఏర్పాటు చేశారు. రెండు రోజుల పాటు ఈ మంచ్ జరిగింది. దీనికి సంబంధించిన ముగింపు సమావేశంలో మాట్లాడిన ఇంద్రేశ్ కుమార్.. కులాలకు.. మతాలకు అతీతంగా దేశాన్ని ప్రథమ ప్రాధాన్యతగా అంతా స్వీకరించాలని పిలుపునిచ్చారు.
ఇంద్రేశ్ నోటి నుంచి వచ్చిన డీఎన్ఏ మాటకు గతంలో మోహన్ భగవత్ కూడా తనదైన అర్థాన్ని చెప్పుకొచ్చు. డీ అంటే డ్రీమ్స్ .. ఎన్ అంటే నేషన్.. ఏ అంటే ఏన్సిస్టర్స్ (పూర్వీకులు) అని పేర్కొన్న ఆయన.. డీఎన్ ఏకు తనదైన అర్థాన్ని చెప్పుకొచ్చారు.
రెండు రోజుల పాటు జరిగిన ఈ మంచ్ కు మహారాష్ట్ర వ్యాప్తంగా 250 మంది హాజరు కాగా.. వారిలో ముస్లిమ మహిళా కార్యకర్తలు కూడా పాల్గొనటం ఆసక్తికరఅంశంగా చెప్పాలి. సంఘ్ అన్నంతనే హిందుత్వ సంస్థగా చూసే వారంతా.. ఈ సంస్థకు సంబంధించిన అసలు నిజాల్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్న మాట వినిపిస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.