Begin typing your search above and press return to search.

వెంకయ్యా! ఇక భజన ఆపవయ్యా..

By:  Tupaki Desk   |   23 March 2016 1:24 PM IST
వెంకయ్యా! ఇక భజన ఆపవయ్యా..
X
ఎవరినైనా సిగ్గుపడేలా పొగడంలో వెంకయ్య నాయుడిని మించినవారు లేరంటారు. ఆ మధ్య ఓసారి ఏపీ సీఎం చంద్రబాబు కూడా అలాగే వెంకయ్య తనను పొగుడుతుంటే కొత్త పెళ్లి కూతురిలా తెగ సిగ్గుపడ్డారు. అంతగా పొగిడే వెంకయ్యకు తాజాగా అనుకోని షాక్ తగిలింది. మోడీని స్తుతిస్తూ వెంకయ్య చేస్తున్న భజనలు శ్రుతి మించుతున్నాయని ఆరెస్సెస్ నేతలు అంటున్నారు. వెంకయ్య రోజురోజుకీ పట్టుపరిశ్రమలో ఆరితేరిపోతున్నారని ఆరెస్సెస్ ముఖ్యులు అనుకుంటున్నారట. వెంకయ్య వంటి సీనియర్ విషయంలో ఆ మాట నేరుగా బయటకు అనలేకపోయినా విషయం అర్థమయ్యేలా చెప్పడంలో మాత్రం వారు ఏమాత్రం మొహమాటపడలేదు. వ్యక్తిపూజ తగదని మందలించింది.

భారత్ కు దేవుడిచ్చిన వరం ప్రధాని నరేంద్ర మోడీ అంటూ వెంకయ్యనాయుడు చేస్తున్న వ్యాఖ్యల పట్ల ఆర్ ఎస్ ఎస్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇటీవల రాజస్ధాన్ లోని నాగౌర్ లో జరిగిన ప్రతినిధి సభ అనంతరం ఆర్ ఎస్ ఎస్ బీజేపీ అగ్రనాయకులతో భేటీ అయ్యింది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు మోడీని దేశానికి దేవుడిచ్చిన వరం అంటూ చేసిన వ్యాఖ్యల పట్ల అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ భేటీకి బీజేపీ జాతీయ కార్యదర్శ అమిత్ షా కూడా హాజరయ్యారు. ఈ భేటీలో బీజేపీ జాతీయత అంశంపై బీజేపీ అనుసరిస్తున్న విధానానికి ఆర్ ఎస్ ఎస్ మద్దతు ప్రకటించింది. అదే సమయంలో ఈ అంశానికి అభృవృద్ధి అంశాన్ని కూడా ప్రముఖంగా ప్రచారం చేయాలని సూచించింది. వ్యక్తి పూజ తగదని సున్నితంగా మందలించింది. వ్యక్తుల కంటే వ్యవస్థే గొప్పదని స్పష్టం చేసింది.