Begin typing your search above and press return to search.

సాగుచట్టాలపై ఆర్ ఎస్ ఎస్ సీరియస్

By:  Tupaki Desk   |   9 Feb 2021 1:30 AM GMT
సాగుచట్టాలపై ఆర్ ఎస్ ఎస్ సీరియస్
X
కొత్త వ్యవసాయ చట్టాలు దేశంలో రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. రైతులు రెండు నెలలకు పైగా ఢిల్లీలో ఆందోళన చేస్తున్నా కేంద్రంలోని బీజేపీ సర్కార్ కరగడం లేదు.. సాగుచట్టాలను వెనక్కి తీసుకోవడం లేదు. ఈ క్రమంలోనే బీజేపీ మిత్రపక్షాలు దూరమైనా డోంట్ కేర్ అంటూ ముందుకే వెళుతోంది.

తాజాగా సాగు చట్టాలపై రైతులు పోరుబాట పట్టి నేపథ్యంలో బీజేపీ దగ్గరి సంస్త ఆర్ఎస్ఎస్ కూడా ఈ వివాదంపై స్పందించింది.ఆర్ఎస్ఎస్ సీనియర్ నేత రఘునందన్ శర్మ తాజాగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అధికారం తలకెక్కిందని.. ప్రజా తీర్పును ఎందుకు కోల్పోవాలనుకుంటున్నారంటూ నిలదీశారు.

మీ ఉద్దేశం రైతులకు మంచి చేసేదే అయినా కొందరు ఆ సాయాన్ని కోరుకోకపోవడం వల్ల అలాంటి పని చేస్తే ఏం లాభం ఉంటుందని ప్రశ్నించారు.ప్రజాభిప్రాయాన్ని కాలరాసి మరో కాంగ్రెస్ లా ప్రవర్తిస్తున్నారని.. ఇప్పటికైనా సాగు చట్టాలపై వెనక్కి తగ్గాలని ఆయన బీజేపీకి హితవు పలికారు.