Begin typing your search above and press return to search.
అమిత్ షాకు అలా చెక్ చెబుతారా?
By: Tupaki Desk | 12 Nov 2015 4:45 AM GMTబీహార్ ఎన్నికల ఫలితాలు బీజేపీలో సృష్టిస్తున్న ప్రకంపలు భారీగానే ఉన్న విషయం తెలిసిందే. తమకు తిరుగు లేదన్నట్లుగా సాగుతున్న మోడీ.. అమిత్ షా తీరుపై కమలనాథులు కోపంగా ఉంటున్నారు. విజయవంతమైన జోడీగా అభివర్ణించే ఈ ఇద్దరి విషయంపై స్పందించటానికి ఆచితూచి అన్నట్లుగా వ్యవహరించే బీజేపీ నేతలు.. ఇప్పుడు మాత్రం తమ మనసులోని వ్యతిరేకతను బయటకు వ్యక్తం చేసేందుకు వెనుకాడటం లేదు. ఇప్పుడు కాకుంటే మరెప్పటికీ సాధ్యం కాదన్న రీతిలో తమ అసంతృప్తిని వ్యక్తం చేసేందుకు అస్సలు మొహమాట పడటం లేదు.
ఇంతకాలం కామ్ గా ఉన్న అద్వానీ వర్గం సైతం యాక్టివ్ అయిపోయింది. పార్టీకి కురువృద్ధుడు లాంటి అద్వానీ.. కీలక సీనియర్లు అయిన మురళీ మనోహర్ జోషీ.. యశ్వంత్ సిన్హా లాంటి వారు మోడీ.. అమిత్ షా తీరును పబ్లిక్ గా తప్పుపట్టటం తెలిసిందే. నేరుగా పేర్లు ప్రస్తావించనప్పటికీ.. అందరికి అర్థమయ్యేలా ఈ విమర్శలు ఉండటం గమనార్హం.
దీంతో.. మోడీ.. అమిత్ షాలపై అసంతృప్తి ఉన్నా మనసులో దాచుకున్న నేతలు ఇప్పుడు గొంతు విప్పుతున్నారు. ఇక.. పార్టీకి వ్యూహకర్తగా భావించే సంఘ్ పరివార్ సైతం ఈ ఇద్దరి జోడీపై తీవ్ర అగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. తమకు తాము సొంత నిర్ణయాలు తీసుకోవటం.. ఏ దశలోనూ ఎవరి మాట వినని రీతిలో వ్యవహరిస్తున్న వీరిద్దరి విషయంలో కఠినంగా ఉండాలన్న రీతిలో వ్యూహం సిద్ధం చేస్తున్నట్లు చెబుతున్నారు.
అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ఏమిటంటే.. బీజేపీ అగ్రనాయకత్వాన్ని మార్చేలా నిర్ణయం తీసుకునేలా మోడీ మీద ఒత్తిడి మొదలు కావటం ఖాయమంటున్నారు. అత్యంత శక్తివంతుడైన నాయకుడిగా మోడీ అవతరించినప్పటికీ.. అసలు శక్తి మొత్తం ‘‘ఆర్ ఎస్ ఎస్’’ దగ్గర ఉంటుందన్న విషయాన్ని మర్చిపోకూడదని చెబుతున్నారు. మోడీని నేరుగా టార్గెట్ చేయకున్న.. ఆయనకు బలంగా ఉండే అమిత్ మీద దృష్టి పెట్టటం ద్వారా.. మోడీని కంట్రోల్ లోకి తీసుకోవాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.
అమిత్ షా విషయంలో కీలక నిర్ణయాలు ఇప్పటికిప్పుడు జరగకున్నా.. సమీప భవిష్యత్తులో అమిత్ షా కు చెక్ చెప్పే పరిస్థితి ఖాయమంటున్నారు. ఆయన్ను అధ్యక్ష పీఠం నుంచి తప్పించే దిశగా కసరత్తు మొదలైందని చెబుతున్నారు. దీనికి మోడీ ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోరన్న సంగతి తెలిసిందే. అయితే.. మోడీ సైతం మాట్లాడలేని పరిస్థితి తీసుకొచ్చి.. అమిత్ కు చెక్ చెబుతారంటున్నారు. తిరుగులేని విజయాలు సాధించే సమయాల్లో.. ఎవరూ లోపాల మీద పెద్దగా దృష్టి సారించరు. కానీ.. ఒక్కసారి లెక్క తేడా వస్తే ఇక అంతే సంగతులు. నిజానికి ఈ విషయాలు మోడీ.. అమిత్ షాలకు తెలియంది కాదు. కాకుంటే.. ఇంతకాలం తమకు తిరుగులేదన్నట్లుగా పరిణామాలు చోటు చేసుకుంటే.. ఇప్పుడు మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి.
మోడీ అండ్ కోను టార్గెట్ చేస్తూ.. అద్వానీ అండ్ టీమ్ నుంచి వచ్చిన లేఖ నేపథ్యంలోనే.. జార్ఖండ్ ఎంపీ ఒకరు తన గళాన్ని విప్పారు. ఎన్నికల ప్రచార సమయంలో వచ్చే జనాన్ని చూసి సంతోషపడిపోతే సరిపోదని.. జనం వస్తేనే ఓట్లు రాలవన్న విషయాన్ని మర్చిపోకూడదంటూ ఎక్కడ తగలాలో అక్కడ తగిలేలా వ్యాఖ్యలు చేయటం గమనార్హం.