Begin typing your search above and press return to search.
లాభాల కోసం చెలగాటం...
By: Tupaki Desk | 12 Sep 2018 11:20 AM GMTతెలుగు రాష్ట్రాలు సమైక్యంగా ఉన్నప్పుడు - తెలంగాణలోని ఆర్టీసీకి వస్తున్న లాభాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ కు ఆంధ్ర నాయకులు దోచిపెడుతున్నారని అప్పట్లో కల్వకుంట్ల చంద్రశేఖర రావు మండిపడ్డారు. ఆయన కోరినట్లే రాష్ట్రం విడిపోయింది. కాని ఆయన అనుకున్నట్లు ఆర్టీసీ లాభాల బాట పట్టలేదు - కాని తెలంగాణలో బస్సు ప్రయాణాలు మాత్రం ఎక్కవయ్యాయి. ప్రజలు చనిపోయిన తర్వాత మా తీవ్ర సంతాపాన్ని తెలియజేస్తున్నామూ అని ఎక్సగ్రీషియా ఇచ్చి చేతులు దులుపుకునే నాయకులకు తన వారిని పోగొట్టుకున్న వారి బాధతోగాని - ప్రజల భద్రతతో గాని పని లేదా అని టీఆర్ ఎస్ ప్రభుత్వాని పలువురు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో సగటు మానువుని ప్రాణానికి విలువ లేదా......జరిగిన సంఘటనలు బట్టి లేదనే అనుకోవాలి. ప్రభుత్వం - అధికారుల నిర్లక్ష్యం 57 మందిని బలిగొంది.
ఆక్యూపేన్సీ పెంచమని అధికారుల తీవ్ర వత్తిడికి అమాయక ప్రజలు బలి అవుతున్నారు. కొండగట్టు ప్రమాదానికి గురి అయిన బస్సు డ్రైవరు గతంలో ఉత్తమ డ్రైవరుగా అవార్డును అందుకున్నారు. అందుకే ఆయనకు మూడు రోజులుగా వరుసగా డ్యూటి వేసారు అధికారులు. పల్లే వెలుగు బస్సు కావడంతో డ్రైవరుకి - ప్రయాణికులకి మధ్య ఉండే ఇనుప రాడ్ ను కూడా తీసివేయడంతో - ప్రయాణికులంతా కూడా డ్రైవర్ పై పడడంతో బస్సు అదుపు తప్పి లోయలోకి పడిపోయినట్లు చెబుతున్నారు. అయ్యా ముఖ్యమంత్రిగారు మాకు హైదారబాదులో ఏసీ బస్ స్టాప్ లు అక్కర్లేదు, మేము బస్సు ఎక్కితే సురక్షితంగా గమ్యం చేరేలా చూడండి అంటూ సగటు ప్రయాణికుడు విజ్నప్తి చేసుకుంటున్నాడు. టీఆర్ ఎస్ నాయకత్వంలో ఆర్టీసీ భ్రష్టుపట్టిందని విపాక్షాలు మండిపడ్డాయి. ఆర్టీసీలో లాభాల కోసం 50 మంది ఎక్కాల్సిన బస్సులో ఏకంగా 104 మందిని ఎక్కిస్తారా అని తమ వారిని పోగొట్టుకున్న వారు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. అడప దడప ఇటువంటి సంఘటనలు జరుగుతున్నప్పటికి ప్రమాదం జరిగినప్పుడు కాకులగా గోల చేయడం తప్పా ప్రమాదాల నివారణకు మాత్రం చర్యలు తీసుకోవటం లేదని వారంటున్నారు. ఆర్టీసీలో లాభాల కోసం తమ ప్రాణాలతో చెలగాటం ఆడవద్దని, మళ్లీ ఇటువంటి సంఘటనలు పునరావ్రుతం కాకుండ చర్యలు చేపట్టాలని నాయకులకూ - అధికారులకు విజ్నప్తి చేస్తున్నారు.