Begin typing your search above and press return to search.
నిలుచొని ప్రయాణిస్తే 50శాతం రాయితీ
By: Tupaki Desk | 19 July 2015 7:42 AM GMTఆఫర్లు చాలానే చూశాం కానీ.. ఇలాంటి న్యాయమైన ఆఫర్ ని మాత్రం ఇప్పటివరకూ చూడలేదనే చెప్పాలి. ఇలాంటి నిర్ణయాన్ని తీసుకున్న ఏపీ ఆర్టీసీని ప్రత్యేకంగా పొగడాల్సిందే.
గోదావరి పుష్కరాల సందర్భంగా ఏపీ ఆర్టీసీ తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు భక్త జనాన్ని ఆనందంతో ముంచెత్తతోంది. పుష్కరాల సందర్భంగా రాజమండ్రి నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో సీట్లు లేక.. నిలుచొని ప్రయాణం చేసే ప్రయాణికులకు యాభై శాతం టిక్కెట్టు మీద రాయితీ ఇస్తున్నారు.
పుష్కరాల సందర్భంగా అలసిసొలసిన ప్రయాణికులకు.. కూర్చోవటానికి సీటు లేక చిరాకు పుట్టించే వారికి.. ఆర్టీసీ కండెక్టర్ ఇస్తున్న యాభై శాతం రాయితీ మట వారిలోని చిరాకు పోగొట్టేలా చేయటమే కాదు.. ఏపీ సర్కారును ప్రశంసించేలా చేస్తోంది. నిజానికి ఈ ఆఫర్ ను.. ఏడాది పొడుగూ చేస్తే.. మరో చక్కటి పథకంగా నిలిచిపోతుందనటంలో సందేహం అక్కర్లేదు.