Begin typing your search above and press return to search.

మిలియన్ మార్చ్ కి సిద్దమైన ఆర్టీసీ, సీఎం నిర్ణయంపై ఉత్కంఠ ?

By:  Tupaki Desk   |   6 Nov 2019 10:23 AM GMT
మిలియన్ మార్చ్ కి సిద్దమైన ఆర్టీసీ, సీఎం నిర్ణయంపై ఉత్కంఠ ?
X
తెలంగాణ లో ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె 33 రోజులకి చేరింది. కార్మికులు తమ డిమాండ్స్ ని పరిష్కరించే వరకు సమ్మె విరమించేది లేదు అని తేల్చి చెప్తున్నారు. మరో వైవు తెలంగాణ సీఎం కేసీఆర్ .. మాత్రం ఇప్పటికే రాష్ట్రంలోని సగం రూట్లని ప్రైవేట్ వారికీ అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అదే సమయంలో ఆర్టీసీ వారికీ ఇదే చివరి అవకాశం అంటూ .. 5 వ తేదీ అర్ధరాత్రి వరకు సమయం ఇచ్చారు.

కానీ , సీఎం ఇచ్చిన డెడ్ లైన్ కి ఆర్టీసీ కార్మికులు పెద్దగా భయపడలేదు. సీఎం కేసీఆర్ చెప్పిన డెడ్ లైన్ లోపు కేవలం 300 కార్మికులు మాత్రమే విధుల్లోకి చేరారు. ఇది మొత్తం 48,600 పై చిలుకు కార్మికులలో ఒక్క శాతం కూడా కాదు. అలాగే విధుల్లో చేరిన వారు చాలామంది రిటైర్మెంట్ కి దగ్గరలో ఉన్నవారే. ఇది ఇలా ఉండగా తెలంగాణ ఉద్యమంలో చేసిన మిలియన్ మార్చ్ లాగానే ఈనెల 9న మిలియన్‌ మార్చ్‌ నిర్వహిస్తామని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి చెప్పారు. మిలియన్‌ మార్చ్‌కు ఉద్యోగ సంఘాల మద్దతు కోరతామని అన్నారు.

ఇక సీఎం కేసీఆర్ ఇచ్చిన డెడ్ లైన్ ముగిసిపోయింది. కే కార్మికులు డెడ్ లైన్ లోగా విధుల్లో చేరకపోతే మిగతా 5,300 రూట్లను కూడా ప్రైవేట్ పరం చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. దీనిపై సీఎం కేసీఆర్ , రోడ్డు రవాణా శాఖ మంత్రి తో పాటుగా పలువురు మంత్రులతో చర్చలు జరుపుతున్నారు. దీనితో ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె పై చివరగా సీఎం కేసీఆర్ ఏ విధంగా మాట్లాడతారో అని అందరూ ఎదురుచూస్తున్నారు.

ఇకపొతే రేపు కోర్టులో సమ్మె పై ,మరోసారి విచారణ జరగనుంది. సమ్మెకి ముగింపు పలకడానికి హైకోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో అని అందరూ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అలాగే ఆర్టీసీ లో 31% వాటా కలిగిన కేంద్ర ప్రభుత్వం ఇప్పటిదాకా వేచి చూసే ధోరణినే అవలంభిస్తుంది. సీఎం కేసీఆర్ అసలు ఆర్టీసీ ని లేకుండా చేయడానికి సిద్దపడుతుండడం తో కేంద్రం ఇప్పటికైనా సమ్మె పై తమ ధోరణి ఏంటో తెలియజేయాలి అని కోరుతున్నారు. ఈ సమ్మె పై అటు ఆర్టీసీ ..ఇటు ప్రభుత్వం పట్టు విడవకపోవడం తో ఈ ఇద్దరి మధ్య సామాన్య ప్రజానీకం నలిగి పోతున్నారు .