Begin typing your search above and press return to search.

ఛలో ట్యాంక్‌ బండ్ కి పిలుపునిచ్చిన ఆర్టీసీ జేఏసీ

By:  Tupaki Desk   |   2 Nov 2019 11:54 AM GMT
ఛలో ట్యాంక్‌ బండ్ కి పిలుపునిచ్చిన ఆర్టీసీ జేఏసీ
X
తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె 28 రోజులకి చేరినా ప్రభుత్వం మెట్టుదిగి రాకపోవడంతో సమ్మెని మరింత ఉదృతం చేయాలనీ ఆర్టీసీ జేఏసీ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా రేపటినుంచి వారం రోజులపాటు తన కార్యాచరణను ప్రకటించింది . ఈయూ భవన్‌లో అఖిలపక్ష నేతలు ఆర్టీసీ జేఏసీ నేతలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో వివిధ అంశాలపై చర్చించి కార్యాచరణ ప్రకటించారు.

ఇకపోతే తాజాగా తెలంగాణ క్యాబినెట్ భేటీ అయ్యింది. ఈ భేటీలో ఆర్టీసీ పై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం వుందటూ వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్టీసీ జేఏసీ నేత అశ్వత్థామరెడ్డి మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకున్న.. భయపడి, బెదరొద్దని తెలియజేసారు. ఈ సమావేశంలో వీ హనుమంతరావు, తమ్మినేని వీరభద్రం, కోదండరాం, రంగారావు తదితర నేతలు పాల్గొన్నారు.

ఇక ఆర్టీసీ కార్యాచరణని ఒకసారి చూస్తే .. 3వ తేదీన అమరుల కోసం పల్లెబాట , 4వ తేదీన డిపోల వద్ద దీక్షలు చేపడుతామన్నారు. ఆర్టీసీ కార్మికులు, నేతలతోపాటు రాజకీయ నేతలు కూడా దీక్షలో పాల్గొంటారని చెప్పారు. 5వ రహదారుల దిగ్బంధనం. 6వ తేదీన అన్ని డిపోల ఎదుట నిరహార దీక్షలు చేపడుతామని ప్రకటించారు. 7వ తేదీన తమ కుటుంబసభ్యులతో కలిసి నిరసన చేపడుతామని , అలాగే 9వ తేదీన ఛలో ట్యాంక్‌ బండ్ కార్యక్రమం చేపట్టబోతున్నట్టు తెలిపాడు. అలాగే 4, 5వ తేదీల్లో ఢిల్లీకి వెళ్ళబోతున్నట్టు తెలిపారు. . అక్కడ వివిధ రాజకీయ పార్టీల నేతలతో సమావేశం అయ్యి , వారి మద్దతును కూడగట్టి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని చెప్పారు