Begin typing your search above and press return to search.

ఆర్టీసీ జేఏసీ సంచలన నిర్ణయం

By:  Tupaki Desk   |   10 Nov 2019 11:12 AM GMT
ఆర్టీసీ జేఏసీ సంచలన నిర్ణయం
X
మిలియన్ మార్చ్ అంటూ ‘చలో ట్యాంక్ బండ్’ను విజయవంతం చేసిన ఆర్టీసీ కార్మికులు ఇదే ఊపులో కేసీఆర్ పై మరింత పోరుబాటకు ప్లాన్ చేశారు. తాజాగా ఆదివారం సమావేశమైన ఆర్టీసీ జేఏసీ, అఖిలపక్ష నేతల సమావేశంలో ఈ మేరకు సంచలన నిర్ణయం తీసుకున్నారు.

సమ్మెపై సీఎం కేసీఆర్ స్పందించని నేపథ్యంలో 12వ తేదీన ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డితోపాటు కోకన్వీనర్ రాజిరెడ్డి సహా మరో ఇద్దరు జేఏసీ నేతలు ఆమరణ నిరాహార దీక్షకు దిగుతున్నట్టు ప్రకటించారు.

ఈ సందర్భంగా చలో ట్యాంక్ బండ్ నిరసన సందర్భంగా ధైర్యవంతంగా నిరసనలో పాల్గొన్న ఆర్టీసీ ఉద్యోగులు, మహిళలను అశ్వత్థామరెడ్డి అభినందించారు. లాఠీచార్జీని నిరసిస్తూ 11న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎమ్మెల్సీల ఇళ్ల ముందు నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు తెలిపారు.

13న చలో ట్యాంక్ బండ్ లో పోలీసుల దమనకాండపై మానవ హక్కుల కమిషన్ ను కలిసి ఆర్టీసీ జేఏసీ ఫిర్యాదు చేయాలని రెడీ అయ్యింది. ప్రభుత్వం కనుక ఇప్పటికైనా చర్చలకు పిలవకపోతే ఉద్యమాన్ని కొత్త పుంతలు తొక్కిస్తామని.. చావడానికైనా వెనుకాడమని అశ్వత్థామరెడ్డి స్పష్టం చేశారు.