Begin typing your search above and press return to search.

మెట్రోలో కింద కూర్చున్న గర్భిణి.. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్వీట్ వైరల్

By:  Tupaki Desk   |   27 Oct 2021 3:05 PM GMT
మెట్రోలో కింద  కూర్చున్న గర్భిణి.. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్వీట్ వైరల్
X
హైదరాబాద్ మెట్రో రైలులో ఇటీవల ఓ గర్భిణి మహిళ కింద కూర్చున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. యువతీ యువకులు సీట్లలో కూర్చొని గర్భిణిని చంటి బిడ్డతో కింద కూర్చున్నా పట్టించుకోలేదని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేశారు. మనుషుల్లో మానవత్వం లేకుండా పోయిందని ఈసడించుకున్నారు.

ఈ వీడియో వైరల్ కావడంతో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పందించారు. ఆర్టీసీ బస్సుల్లో ఇలాంటి ఘటనలు చోటుచేసుకునే అవకాశమే లేదని ఆయన ఒక్క ట్వీట్ తో కళ్లకు కట్టినట్టు చూపించారు.

మెట్రోలో మధ్యలో చాలా ఖాళీ ప్రదేశం ఉంటుంది. కేవలం నిలబడడానికే ఎక్కువ సమయం ఉంటుంది. కానీ ఆర్టీసీ బస్సుల్లో అంత స్థలం ఉండదని.. సీట్లలోనూ కూర్చోవాలని.. పైగా మహిళలకు ప్రత్యేకంగా సీట్లు కేటాయిస్తారని సజ్జనార్ ఒక వీడియోతో అందరికీ అర్థమయ్యేలా చెప్పుకొచ్చారు. అప్పుడు ఇప్పుడూ ఎల్లప్పుడూ నైతిక విలువలు పెంచే ఏకైక ప్రదేశం టీఎస్ ఆర్టీసీ అని సజ్జనార్ వెల్లడించారు. అందుకే ప్రతి ఒక్కరూ ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసి నైతిక విలువలను పెంచుకుందామని సజ్జనార్ పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా ఓ వీడియోను కూడా సజ్జనార్ పోస్ట్ చేశారు. సదురు వీడియోను వినూత్న రీతిలో విద్యార్థులతో రూపొందించారు. ఈ వీడియోలో బస్సు ప్రయాణిస్తుండగా.. తొలుత ఓ వృద్ధురాలు రాగా వేరే వారు నిలబడి ఆమెకు సీటు ఇస్తారు.. ఆ తర్వాత వికలాంగురాలు.. పాపతో మహిళ, గర్భిణులు వచ్చినా వేరే వాల్లు సీట్లు త్యాగం చేసి వారికి ఇస్తారు. ఈ వీడియోను షేర్ చేసిన సజ్జనార్ ఆర్టీసీ బస్సుల్లో స్త్రీలకు గౌరవం ఇస్తారని సజ్జనార్ పేర్కొన్నారు.