Begin typing your search above and press return to search.
లేదా ఉచిత సలహా ఇచ్చిపారేసిన ఆర్టీసీ ఎండీ
By: Tupaki Desk | 7 May 2015 9:26 AM GMTఇంటర్ పూర్తయిన విద్యార్థుల్లో అత్యధికం ఎంసెట్ కోసం ఎంత జాగ్రత్తగా ప్రిపేర్ అవుతారో.. ఎన్ని ఆశలు పెట్టుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంసెట్ పరీక్ష కోసం వారు పడే పాట్లు అన్ని ఇన్నీ కావు.
ఇదిలాఉంటే..తాజాగా ఆర్టీసీ ఉద్యోగులు చేస్తున్న సమ్మె.. ఎంసెట్ విద్యార్థులకు కొత్త కష్టాన్ని తీసుకొస్తోంది. ఏపీలో ఎంసెట్ పరీక్షలు శుక్రవారం జరగనున్నాయి. ఈ నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల నుంచి పరీక్షా కేంద్రాలకు చేరుకోవటం ఇబ్బందికరంగా మారనుంది. ఇదే విషయాన్ని ఆర్టీసీ ఎండీ సాంబశివరావుతో మీడియా మాట్లాడితే.. ఆయన సింఫుల్ గా ఒక ఉచిత సలహా ఇచ్చిపారేశారు.
పరీక్ష రాయటానికి వెళ్లే విద్యార్థులు..ఒక రోజు ముందుగా పరీక్షా కేంద్రాలకు చేరుకునేలా ప్లాన్‌చేసుకోవాలనన సలహా ఒకటి ఇచ్చారు. వాస్తవానికి.. పరీక్ష ముందు రోజు విద్యార్థులకు సహజంగా టెన్షన్ ఉంటుంది. దీనికి తోడు అన్నట్లుగా..ఆర్టీసీ సమ్మె వారిపై మరింత ఒత్తిడి తీసుకురావటం ఖాయం. సమ్మెను విరమింపచేయటంలో ఫెయిల్ అయిన ఎండీ.. విద్యార్థులకు మాత్రం సలహా చాలా సింఫుల్ గా ఇచ్చేశారు.
ఇక్కడ సమస్య ఏమిటంటే.. గ్రామీణ విద్యార్థులు..పరీక్షా కేంద్రాలకు దూరంగా ఉండే వారంతా ఒక రోజు ముందు అంటే.. గురువారం రాత్రికి చేరుకోవాల్సి ఉంటుంది.
అసలే ఎండాకాలం..ఉక్కపోత తీవ్రంగా ఉండే నేపథ్యంలో.. పరీక్షా కేంద్రాలకు దగ్గరగా బంధువులు..స్నేహితులు ఎవరూ లేకపోతే..వారికి బస.. భోజనం మాటేమిటి? డబ్బులున్న మారాజులైతే ఏదోలా సర్దుకుంటారు. మరి.. ఆర్థికంగా బలహీనమైన వారి పరిస్థితి ఏమిటి? అందుకేనేమో.. సలహాలు ఇవ్వటం చాలా ఈజీ అని.