Begin typing your search above and press return to search.

హైకోర్టు అచేతనం.. కార్మికులకు ఇక నరకం

By:  Tupaki Desk   |   12 Nov 2019 7:39 AM GMT
హైకోర్టు అచేతనం.. కార్మికులకు ఇక నరకం
X
తెలంగాణ ఆర్టీసీ సమ్మె.. మొన్నటి వరకు కార్మికుల పట్టు.. కేసీఆర్ మొండి పట్టు.. వీరిద్దరి మధ్యలో నలిగి పోయిన ఆర్టీసీ భవితవ్యం కేవలం హై కోర్టు పైనే ఆధార పడి ఉండేది. హైకోర్టు సైతం విచారణ లో భాగం గా కేసీఆర్ సర్కారు తప్పుడు అఫిడవిట్లు.. నిర్లక్ష్యం.. సమ్మె పరిష్కరించక పోవడం పై నిలదీయడం తో కార్మికుల్లో ఆశలు చిగురించాయి. హై కోర్టు ఈ సమ్మెను పరిష్కరిస్తుందని కార్మికులు కొండంత ఆశగా ఉన్నారు. కానీ ఇప్పుడు ఆ ఆశ పోయింది. కార్మికులకు నిరాశ ఎదురైంది. కేసీఆర్ పంతమే నెగ్గేలా కనిపిస్తోంది.

తాజాగా ఆర్టీసీ సమ్మె విషయం లో హై కోర్టు చేతులెత్తేసింది. ఎటూ నిర్ణయం తీసుకో లేక విచారణ వాయిదా వేసింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో తాము జోక్యం చేసుకో లేమని కుండబద్దలు కొట్టింది. దీంతో కార్మికులకు ఉన్న చిన్న ఆశ కూడా పోయింది.

ఇటీవల ఆర్టీసీని సగం ప్రైవేటీకరిస్తూ కేసీఆర్ సర్కారు నిర్ణయం తీసుకుంది. కేబినెట్ తీసుకున్న ఈ నిర్ణయం పై మొదట్లో స్టే ఇచ్చింది. కానీ ఇప్పుడు ప్రభుత్వ విధాన నిర్ణయాల పై జోక్యం చేసుకోలేమంటూ తీర్పునిచ్చింది. ఇక ఆర్టీసీ కార్మికుల సమ్మె ను చట్ట విరుద్ధమని ప్రకటించ లేదు. ప్రభుత్వం, కార్మికుల ను చర్చలకు ఒప్పించేందుకు అన్ని మార్గాల్ని అన్వేషిస్తోంది.

ఆర్టీసీ ని ప్రభుత్వం లో విలీనం చేయాలనే ప్రధాన డిమాండ్ పై కార్మికులు వెనక్కి తగ్గడం లేదు. మరో వైపు విలీనం అన్న ప్రతి పాదనే లేదని ప్రభుత్వం చెబుతోంది. వీరిద్దరి మొండి పట్టుదల వల్ల తెలంగాణ లో ప్రజా రవాణా దారుణంగా పడిపోయింది. చాలా మంది ఆటోలు, మెట్రో, ఇతర క్యాబ్స్ లలో ప్రయాణిస్తున్నారు. 39 రోజులుగా జరుగుతున్న సమ్మె పై హై కోర్టు అచేతనం గా మారడం కార్మికుల కు శరాఘాతం గా మారింది.