Begin typing your search above and press return to search.

మెట్టు దిగిన ఆర్టీసీ కార్మికులు.. కేసీఆర్ ఎలా రియాక్ట్ అవుతారు ?

By:  Tupaki Desk   |   15 Nov 2019 5:22 AM GMT
మెట్టు దిగిన ఆర్టీసీ కార్మికులు.. కేసీఆర్ ఎలా రియాక్ట్ అవుతారు ?
X
అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. 41 రోజులుగా సాగుతున్న తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు సంబంధించి కీలకమైన డిమాండ్ల లో ప్రధానమైనది ఆర్టీసీని ప్రభుత్వం లో విలీనం చేయటం. ఇన్నాళ్లు పోరాడిన ఆర్టీసీ జేఏసీ తాజాగా తమ ప్రధాన డిమాండ్ ను పక్కన పెట్టేసి.. మిగిలిన డిమాండ్ల ను పరిష్కరించాలంటూ మెట్టు దిగిన వైనం ఇప్పుడు ఆసక్తకరంగా మారింది.

ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి సానుకూల స్పందన రాకుండా ఉండటం.. రెండు నెలలుగా జీతాలు లేకపోవటం.. మరికొన్ని రోజులు సమ్మె సాగితే కార్మికులు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయే ప్రమాదం పొంచి ఉండటం లాంటి కారణాలతో తాజా నిర్ణయాన్ని వెల్లడించారని చెబుతున్నారు.

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే డిమాండ్ విషయంలో ఒప్పుకునేది లేదని మొదట్నించి కరా ఖండిగా చెబుతున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మాట కు తగ్గట్లే.. తాజాగా కార్మికులు ఒక అడుగు వెనకడుగు వేయటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె విషయం లో మొదట్నించి సానుకూలంగా లేని కేసీఆర్.. సమ్మెపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేయటం తెలిసిందే.

ఇప్పటి కే రెండుసార్లు సమ్మెను భేషరుతుగా వదులు కొని ఉద్యోగాల్లో చేరాలని చెప్పిన కేసీఆర్.. అంతకు మించి ఆర్టీసీ కార్మికుల డిమాండ్ల విషయం లో సానుకూలంగా స్పందించింది లేదు. తాజాగా ఆర్టీసీ జేఏసీ నేతలు ఒక అడుగు వెనక్కి వేయటం ద్వారా సమ్మెను కొనసాగే విషయం లో తాము పడుతున్న ఇబ్బందిని ప్రభుత్వానికి చెప్పకనే చెప్పేశారని చెప్పాలి.

తాజా పరిణామాల నేపథ్యం లో కేసీఆర్ సర్కారు ఎలా రియాక్ట్ కానుంది? విలీనంపై వెనక్కి తగ్గిన వైనం పై ఆర్టీసీ జేఏసీ తాజా స్టాండ్ కు ముఖ్య మంత్రి ఎలా స్పందిస్తారన్నది ఉత్కంట గా మారుతోంది. అయితే.. కేసీఆర్ మైండ్ సెట్ తెలిసిన పలువురు మాత్రం.. ఆర్టీసీ జేఏసీ వేసిన వెనకడుగు తెలంగాణ ముఖ్యమంత్రి లో మరింత స్థైర్యాన్ని పెంచుతుందంటున్నారు. తాను మొదట్నించి వినిపిస్తున్న వాదనకే ఆయన కట్టుబడి ఉంటారంటున్నారు.

విలీనంపై వెనక్కి తగ్గినంత మాత్రాన ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేసే అవకాశం ఉందంటున్నారు. ఒకవేళ అడుగు ముందుకు వేయాల్సి వస్తే.. అందుకు మరికొన్నిరోజుల సమయం పడుతుందంటున్నారు. ఏమైనా.. విలీన డిమాండ్ పై వెనక్కి తగ్గటంలో ఆర్టీసీ జేఏసీకి మరో ఆప్షన్ లేదన్నది నిజమే అయినా.. తమ విషయంలో కేసీఆర్ పాజిటివ్ గా రియాక్ట్ అయ్యే అవకాశం తక్కువే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి..ఈ అంచనా ఎంతవరకూ నిజమవుతుందన్నది కాలమే చెప్పాలి.