Begin typing your search above and press return to search.

ఐదేళ్లలో ఎంపీల సబ్సిడీ ఫుడ్‌ కోసం రూ.60.7కోట్లు

By:  Tupaki Desk   |   24 Jun 2015 4:25 AM GMT
ఐదేళ్లలో ఎంపీల సబ్సిడీ ఫుడ్‌ కోసం రూ.60.7కోట్లు
X
ప్రజల నడ్డి మీద పన్నుల భారం మోపి మరీ వసూలు చేసే నిధులు ఎంత చక్కగా ఖర్చు అవుతున్నాయో తెలిసిందే. 110కోట్లకు పైగా ప్రజలు ప్రతిరోజూ తాము వినియోగించే ప్రతి వస్తువకు పన్నులు చెల్లించి మరీ వాడుకునే పరిస్థితి. కనీస సౌకర్యాల విషయంలోనూ ఏ మాత్రం సంతృప్తి కలగని రీతిలో పరిపాలనను అందించే రాజకీయ వ్యవస్థ..తమకు తాము ఎంత జాగ్రత్తగా చూసుకుంటుందన్న విషయాన్ని చూస్తే ఆశ్చర్యం కలగక మానదు.

సబ్సిడీ మీద ఫుడ్‌ ఇచ్చే పార్లమెంటు క్యాంటీన్లు.. గత ఐదేళ్ల కాలంలో ప్రజాప్రతినిధులు.. పార్లమెంటుకు వచ్చే వారి కోసం రూ.60.7కోట్ల మేర ప్రజాధనాన్ని సబ్సిడీ రూపంలో అందజేశారు. ఎందుకిలా అంటే.. మసాలా దోశను రూ.6.. మటన్‌ కర్రీని రూ.20లకు.. చిప్స్‌తో సహా చేపల వేపుడ్ని రూ.25 కారుచౌకధరలకు అందిస్తున్న పరిస్థితి.

అందుకేనేమో.. తాము తినే క్యాంటీన్లో ఇంత తక్కువ ధరకు ఆహారపదార్థాలు అందించటంతో.. బయట కాస్త అటూఇటూగా ధరలు ఇలానే ఉంటాయన్న ఉద్దేశ్యంలో ప్రజాప్రతినిధులు ఉంటారేమో.

ప్రజలకు సేవ చేయటమే లక్ష్యంగా చెప్పుకునే ఈ ఎంపీలు నెలకు రూ.1.40లక్షల జీతం తీసుకుంటారన్న విషయాన్ని మర్చిపోకూడదు. ఇవి కాక.. మరిన్ని సౌకర్యాలు లభిస్తాయి. ఇంత భారీగా జీతం తీసుకుంటూ.. అత్యంత తక్కువ ధరలకే ఆహారపదార్థాలు అందించటం గమనార్హం. తాజాగా సహ చట్టం ద్వారా దాఖలు చేసిన ఒక దరఖాస్తులో అడిగిన ప్రశ్నలకు సమాధానంగా గడిచిన ఐదేళ్లలో సబ్సిడీ కింద క్యాంటీన్ల కారణంగా సర్కారు మీద పడిన భారం రూ.60.7కోట్లుగా తేలింది. ఆహారపదార్ధాల మీద 63 శాతం నుంచి 150 శాతం మేర రాయితీ ఇస్తున్నారు. మొత్తంగా 76 రకాల ఆహారపదార్థాలు అందిస్తున్నారు.

ఇక.. క్యాంటీన్లో ధరలు చూస్తే.. (శాంపిల్‌గా)

- మసాలా దోశ రూ.6

- చేపల వేపుడు రూ.25 (చిప్స్‌ కూడా ఇస్తారు)

- మటన్‌ కట్లెట్‌ రూ.18

- మటన్‌ కూర రూ.20 (విత్‌ బోన్స్‌)