Begin typing your search above and press return to search.
కొన్ని గంటల ముందే తప్పు చేసి దొరికినా వదిలేశారు!
By: Tupaki Desk | 2 Dec 2019 6:53 AM GMTదేశ వ్యాప్తంగా కదిలించి వేసిన దిశ హత్యాచార ఉదంతానికి సంబంధించి కొన్ని కొత్త విషయాలు బయటకు వచ్చాయి. దిశను కిడ్నాప్ చేసిన వెంటనే పోలీసులు రియాక్ట్ కాకపోవటం ఒక వైఫల్యమైతే.. ఈ దారుణం జరగటానికి కొన్ని గంటల ముందే ఆర్టీవో అధికారులకు తప్పు చేసి దొరికినా వదిలేయటం కూడా వెటర్నరీ వైద్యురాలి హత్యకు కారణమైందని చెప్పాలి.
దిశ హత్యాచార ఘటనలో ఏ1 అయిన మహ్మద్ ఆరిఫ్ లు.. మరో నిందితుడైన శివ కలిసి కర్ణాటకలోని గంగావతి నుంచి ఇటుక లోడుతో బయలుదేరారు. మధ్యలో స్నేహితులు నవీన్, చెన్నకేశవులు వారిని కలిశారు. దొంగతనం చేసి తెచ్చిన ఇనుమును లారీలో వేశారు. వీరి వాహనం మహబూబ్ నగర్ చేరుకునే సరికి అక్కడ తనిఖీలు నిర్వహిస్తున్న ఆర్టీయే అధికారులు వీరి వాహనాన్ని ఆపారు.
ఆరిఫ్ కు డ్రైవింగ్ లైసెన్స్ లేకపోవటం.. వాహనం ఓవర్ లోడ్ తో ఉండటంతో వాహనాన్ని సీజ్ చేశారు. ఈ విషయాన్ని ఆరిఫ్ తన యజమాని శ్రీనివాసరెడ్డికి ఫోన్లో సమాచారం ఇవ్వగా.. అధికారులు వాహనాన్ని తీసుకెళ్లకుండా ఉండేలా లారీ సెల్ప్ మోటారు తాడును లూజ్ చేయాలన్నారు. దీంతో వాహనం కదల్లేదు. ఈ కారణంతో వాహనాన్ని వదిలేసి ఆర్టీఐ అధికారులు వెళ్లిపోయారు.
ఒకవేళ.. వారిని అదుపులోకి తీసుకొని పోలీసులకు అప్పజెప్పినా పరిస్థితి మరోలా ఉండేది. కానీ.. ఆర్టీఐ అ ధికారులు వదిలేయటంతో వారు హైదరాబాద్ కు చేరుకున్నారు. తాము దొంగలించిన ఇనుమును అమ్మితే నాలుగు వేల రూపాయిలు వచ్చాయి. దీంతో.. వారు పార్టీ చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. మద్యం తాగుతూ టోల్ వద్ద వాహనాన్ని నిలపగా.. అదే సమయంలో దిశ తన వాహనాన్ని లారీ పక్కన పార్క్ చేసింది. ఈ సమయంలోనే ఆమె మీద కన్నేసిన నిందితులు.. తర్వాత వేసిన దుర్మార్గపు ప్లాన్ అందరికి తెలిసిందే. మహబూబ్ నగర్ వద్ద ఆర్టీఐ అధికారులు వీరిని అడ్డుకున్నప్పుడే పోలీసులకు అప్పజెప్పి ఉంటే ఈ దారుణం జరిగి ఉండేది కాదు కదా.. ఒక నిండు ప్రాణం బలి కాకుండా పోయేది.