Begin typing your search above and press return to search.
అమిత్ షాను వాళ్లెంతగా ఇబ్బందిపెట్టారంటే
By: Tupaki Desk | 31 March 2018 6:08 AM GMTబీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు కర్నాటక ఎన్నికలు చేదు అనుభవాన్ని మిగులుస్తున్నాయని అంటున్నారు. ఒకదాని వెంట ఒకటి అన్నట్లుగా అమిత్‌సా ఆందోళన చెందే పరిణామాలే ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. కొద్దికాలం క్రితం యడ్యురప్పను అవినీతి ముఖ్యమంత్రి అని ప్రకటించడం, అనంతరం అనువాదంలో మోడీ దేశాన్ని అభివృద్ధి చెందిస్తారని కాకుండా నాశనం చేస్తారని వ్యాఖ్యానించి ఇరుకున పడ్డ సంగతి మరువకముందే మరో ఘటన జరిగింది. మైసూర్‌లో దళితులతో ప్రత్యేక సమావేశం నిర్వహించిన అమిత్ షాకు ఊహించని పరిణామం ఎదురై ఉక్కిరిబిక్కిరి చేసింది.
కర్నాటకకు చెందిన కేంద్రమంత్రి అనంత్ కుమార్ హెగ్డే ఈ ఏడాది జనవరిలో దళితులను అవమానపరుస్తూ చేసిన వ్యాఖ్యలు అమిత్ షాను ఇరుకున పడేశాయి. రెండు నెలల క్రితం బళ్లారిలో పర్యటించిన సందర్భంగా కేంద్రమంత్రి హెగ్డే దళితులను ఉద్దేశిస్తూ వీధి కుక్కలు మొరిగితే పట్టించుకోనని అన్నారు. రాజ్యాంగంపై హెగ్డే వ్యాఖ్యలకు నిరసనగా దళిత సంఘాల కార్యకర్తలు ఆయన్ని అడ్డుకొని నినాదాలిచ్చిన సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ ఉదంతాన్ని పేర్కొంటూ మీ వైఖరి - మీ పార్టీ వైఖరి ఏంటో చెప్పాలంటూ దళిత సంఘాల నేతలు - కార్యకర్తలు అమిత్ షాను నిలదీశారు. దాంతో,ఖంగుతిన్న అమిత్ షా వారికి ఏం సమాధానం చెప్పాలో తెలియక కంగారుపడ్డారు. తనను చుట్టుముట్టిన దళితులు మూకుమ్మడిగా డిమాండ్ చేయడంతో అవి హెగ్డే వ్యక్తిగత వ్యాఖ్యలని - పార్టీ ఆయనతో ఏకీభవించదని అన్నారు.
మరోవైపు తాజా సంఘటన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఘాటుగా స్పందించింది. రెండు నెలల క్రితం దళితులను అవమానిస్తూ వ్యాఖ్యలు చేసిన మంత్రిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించింది. దళితుల విషయంలో బీజేపీ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నదంటూ కాంగ్రెస్ నేత రణదీప్ సూర్జేవాలా విమర్శించారు. 'బీజేపీ దళిత వ్యతిరేక భావజాలం మరోసారి బహిర్గతమైంది. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా రాజకీయ ఊసరవెళ్లిలా వ్యవహరిస్తున్నారు. కేంద్రమంత్రి హెగ్డే విషయంలో అవకాశవాదాన్ని ప్రదర్శించారు. అమిత్ షాకు హెగ్డేపై వేటు వేసే ధైర్యముందా..? ద్వంద్వ వైఖరిని ఆపాలి' అంటూ సూర్జేవాలా ట్వీట్ చేశారు. మొత్తంగా ఎన్నికల ప్రచారం సందర్భంగా అనుకోని సంఘటనలు ఎదురై అయోమయానికి గురి చేస్తున్నాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.