Begin typing your search above and press return to search.

అంబానీ కొడుకునే కరిగించేసింది.. ఇదే రుజిత డైట్

By:  Tupaki Desk   |   21 Aug 2019 1:30 AM GMT
అంబానీ కొడుకునే కరిగించేసింది.. ఇదే రుజిత డైట్
X
108 కిలోలతో అరవీర భయంకరంగా స్థూలకాయంతో బాధపడుతున్న దేశంలోనే నంబర్ 1 ధనవంతుడు ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీని ఇట్టే కరిగించేసి స్మార్ట్ గా తయారు చేసింది ఈమె. ఈమె డైట్ ప్లాన్ ఇతర సూచనలతోనే భారీ కాయుడిగా ఉన్న అనంత్ అంబానీ ఇప్పుడు స్లిమ్ గా తయారయ్యాడు. దేశంలోనే నంబర్ 1 డైటీషియన్ గా ఇప్పుడు ఈమె లక్షల జీతం తీసుకుంటోంది. అసలు ఈమె చెప్పే డైట్ ఏంటి? అది తీసుకుంటే కరెంట్ తీగలా మారిపోతారా? అన్న దానిపై ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది.

ఇప్పుడు దేశంలోనే నంబర్ 1 డైటీషియన్ గా రుజిత దివేకర్ పేరు మారుమ్రోగిపోతోంది. ఆమె డైట్ ఫాలో అయిన వారంతా సన్నజాజిలా మారిపోతుండడంతో ఈమె అసలు చెప్పే డైట్ ఏంటన్న ఆసక్తి నెలకొంది.

ఇప్పుడు స్థూలకాయం అనేది ప్రపంచ సమస్యగా మారింది. జంక్ ఫుడ్, వేళాపాలా లేని ఉద్యోగాలు తిండితో ఇలా బరువు పెరిగిపోతున్నారు. వ్యాయామం చేయకపోవడంతో అధిక బరువు పెరిగి బీపీ- షుగర్ - గుండె జబ్బుల బారిన పడుతున్నారు. ప్రాణాలు తీసేలా స్థూలకాయం ఇప్పుడు ప్రధాన సమస్యగా మారింది. పట్టణాల్లో అయితే పరిస్థితి మరీ ఘోరంగా ఉంది.

మరి 108 కిలోల బరువున్న అంబానీ కొడుకునే కరిగించేసిన ప్రముఖ డైటీషియన్ రుజిత దివేకర్ చెప్పిన అసలు రహస్యమేంటి.? ఆమె సూచించిన డైట్ ప్లాన్ ఏంటనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

* సన్నబడాలనుకునే వారికి రుచిత ఇస్తున్న డైట్ సూచనలు ఇవే.
1.విదేశాల నుంచి దిగుమతి అయ్యే యాపిల్, కివీలను వదిలేసి దేశీయ పండ్లైన మామిడి- నారింజ- ద్రాక్ష- సపోటా- అరటి పండ్లను తినాలి.. పండ్లలో ప్రక్టోజ్ ఉంటుంది. ఇది రక్తంలోని గ్లూకోజ్ ను కంట్రోల్ చేసి ఆరోగ్యాన్ని పెంచుతాయి.

2.ఇక వేరుశనగ- నువ్వులు- కొబ్బరి- ఆవాలు- ఆలివ్- రైస్ బ్రాన్ నూనెలను వంటల్లో వాడాలి.

3. తరచూ చెరకు రసాన్ని తాగాలి. ఇది శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపి శరీరాన్ని క్లీన్ చేస్తుంది. చెరుకు రసం లేకపోతే వాటి ముక్కలు అయినా తినండి

4.ఓట్స్ గుండె కు మంచిది. ప్యాకింగ్ కాకుండా బయట సహజసిద్ధంగా ఉండే వాటిని తీసుకొని తినాలి. ఓట్స్ బిస్కట్ మాత్రం తినొద్దు. అవి డేంజర్.

5. నెయ్యి తినడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది. సో నెయ్యిని ఆహారంలో ఖచ్చితంగా తీసుకోవాలి.

6. పండ్లను కొరుక్కొని నమిలి తింటేనే ఆరోగ్యం. పండ్ల రసాలను అస్సలు తాగకండి. రసం తీస్తే వాటిల్లో ఉండే పోషకాలు మొత్తం పోయి శరీరం గ్రహించదు.

7. ప్రతీరోజు ఆహారంలో కొబ్బరిని ఖచ్చితంగా వాడాలి. ఇడ్లీలు, దోశలు, అన్నం తదితర వాటిని కొబ్బరి చట్నీలతో తినాలి. ఇవీ అధిక బరువును తగ్గించి సన్నబడేలా చేస్తుంది.

8.నిత్యం వ్యాయామం చేయండి. క‌ఠిన వ్యాయామాలు చేయ‌డం కుద‌ర‌క‌పోతే క‌నీసం రోజూ వాకింగ్ అయినా చేయండి.

9. మామూలు తెల్లని అన్నాన్ని భేషుగ్గా తిన‌వ‌చ్చు. బ్రౌన్ రైస్ అయినా ఫ‌ర‌వాలేదు. రైస్ గ్లైసీమిక్‌ ఇండెక్స్ (తిన్న వెంటనే దేహంలో పెరిగే గ్లూకోజ్) సాధారణంగానే ఉంటుంది. అది పప్పు, పులుసు, పెరుగు వంటి వాటితో కలిస్తే దాని గ్లైసీమిక్‌ ఇండెక్స్ మరింత తగ్గుతుంది. వీటికి తోడు నెయ్యిని కూడా చేరిస్తే అది మరింత తగ్గుతుంది. దీంతో రైస్‌ను తిన్నా ఏమీ కాదు. గ్లూకోజ్ స్థాయిలు కంట్రోల్‌లోనే ఉంటాయి. రైస్ లో మ‌న శ‌రీరానికి అవ‌స‌రం అయ్యే మినరల్స్ ఉంటాయి. కాబట్టి రోజుకు మూడుసార్లు కూడా రైస్‌ తినవచ్చు .

10. ప్యాక్ చేయ‌బ‌డిన‌, ప్రాసెస్ చేయ‌బ‌డిన ఆహారాల‌ను తిన‌కండి. అవి శ‌రీర బ‌రువును పెంచుతాయి.

11. ఒక‌ప్పుడు మ‌న పెద్ద‌లు తిన్న ఆహారాన్ని తినేందుకు య‌త్నించండి. రోజూ వీలుకాక‌పోతే క‌నీసం ఎప్పుడో ఒక‌సారి అయినా ఆ ఆహారాన్ని తినేందుకు య‌త్నించండి.

12. మీరు తినే ఆహారం మిమ్మల్ని భయపెట్టకూడదు. మీరు తినే ఆహారం మిమ్మల్ని మంచిగా ఫీల్ అయ్యేలా చేయాలి.

13. ఎన్ని క్యాల‌రీలు ఉన్న ఆహారాన్ని తింటున్నామో అని భ‌య‌ప‌డ‌కండి. ఎన్ని పోష‌కాలు ఉన్న ఆహారాన్ని తింటున్నారో అది చూసుకోండి.

14. నిల్వ‌చేసిన ప్యాక్డ్‌ ఫుడ్- డ్రింక్స్ ఏమీ తీసుకోకండి.

15.రైస్, చపాతీ రెండూ తినవచ్చు, లేదా ఒక్క రైస్ మాత్రమే తినవచ్చు, లేదా కేవ‌లం చ‌పాతీలు మాత్ర‌మే తిన‌వ‌చ్చు. అది మీ ఇష్టం. అలాగే మూడు పూటలా మీ ఇష్టం వచ్చినట్టు ఏమీ భయపడకుండా తినండి. మీ ఆకలిని బట్టి తినండి.

16. రుతువును బట్టి తినండి. వర్షాకాలం లో పకోడీలు, జిలేబీలు లాంటివి తినండి. ఎందుకంటే ఆకలి రుతువును బట్టి ఉంటుంది. ఒక్కో సీజన్‌లో వేపుళ్ళు తినాలి. తినండి.

17. ఉదయాన్నే టీ తాగ‌కండి. అలాగే బాగా ఆకలిగా ఉన్నప్పుడు కూడా టీ తాగకండి. రోజులో రెండు మూడు సార్లు పంచదార వేసుకుని టీ తాగండి.

18. గ్రీన్ టీ తాగకండి. ఎల్లో టీ, గులాబీ టీ, నీలం టీల‌ను కూడా తాగ‌వ‌ద్దు. వాటికి దూరంగా ఉండండి.

19. పిజ్జా, పాస్తా, బ్రెడ్, బిస్కట్, కేకులు అస్సలు తినొద్దు. వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది

20. ఆక‌లి తీరే వ‌ర‌కు తినండి. ఎంతైనా తినండి. కానీ ఆక‌లి లేకుండా మాత్రం ఏమీ తిన‌కండి. మీ పొట్ట ఏమి చెబితే దాన్ని ఫాలో అవండి.

పైన చెప్పిన నియ‌మాల‌ను ప్రముఖ డైటీషియన్ రుజిత తన క్లయింట్లకు సూచిస్తుంది. పాటిస్తే ఎవ‌రైనా అధిక బ‌రువును సుల‌భంగా త‌గ్గించుకోవ‌చ్చని ఆమె డైట్ చెబుతోంది.